పవిత్రమైన రంజాన్ సందర్బంగా ముస్లిమ్ సోదరులందరికీ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, ఆలేరు మాజీ జెడ్పిటీసి బొట్ల పరమేశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ .. ప్రపంచవ్యాప్తంగా ఉండే ముస్లిములందరికీ ఈ రంజాన్ మాసం చాలా ప్రత్యేకమైందని, చంద్రుడు కనిపించడంతో ప్రారంభమైన రంజాన్ ఉపవాస దీక్షలు నెల రోజుల పాటు ముస్లిములలో చాలా మంది కఠినమైన నియమ నిష్టలతో, ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాన్ని కొనసాగించారని బొట్ల పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ అల్లాహ్ అనుగ్రహం అనునిత్యం ఉండాలని, మీ అందరి జీవితాలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ‘సరైన మార్గంలో నడుస్తూ, అల్లాహ్ పై భక్తి, విశ్వాసాలు కలవారికి వారి కర్మానుసారం మంచి, పవిత్రమైన జీవితం ప్రసాదించబడుతుంది. ప్రతి ఒక్కరూ పేదలు పడే ఆకలి బాధలు తెలుసుకోవడమే రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల ఉద్దేశ్యమని, దేవుడు మీకు సంతోషకరమైన జీవితాన్ని ఇచ్చాడు. మీ జీవితం ఆనందంగా ఉండిపోనివ్వండి. దుఃఖంపై మీ నీడ దరిచేరనీయకండి. అల్లా ఆశీర్వాదంతో మీరు చిరునవ్వుతో జీవితాన్ని కొనసాగించాలి. ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో అల్లాహ్ మీ కష్టాలను తొలగించి, మీకు శాంతి, సంపద, ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సు ఇస్తాడని ఆశిస్తూ..ముస్లిమ్ సోదరుల కుటుంబ సభ్యులకు బొట్ల పరమేశ్వర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
Related posts
-
ప్రెస్ క్లబ్ హైదరాబాద్-2023 డైరీ ఆవిష్కరించిన డీజీపీ
Spread the love శాంతిభద్రల పరిరక్షణలో మీడియా పాత్ర కీలకమని తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్... -
Union Railway Minister Shri Ashwini Vaishnaw flags off India’s first aluminium freight rake developed by Hindalco
Spread the love -Significant milestone in India’s modernisation drive in mass transportation – Switch to aluminium significantly... -
మీడియా రంగాన్ని నిర్వీర్యం చేస్తే ఆందోళన ఉదృతం: ఐజేయూ, టీయుడబ్ల్యుజె సంఘాల హెచ్చరిక
Spread the love దేశంలో మీడియా రంగాన్ని నిర్వీర్యం చేసి భావ ప్రకటన స్వేచ్ఛను కనుమరుగు చేసే పాలకుల కుట్రలను తమ ఆందోళనలతో...