ఘనంగా “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా టీజర్ లాంఛ్

Grand launch of the "Kalyanam Kamaneeyam Jeevitham" movie teaser.

వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై, ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్స్ గా రవి లోకిరెడ్డి డైరెక్షన్ లో పైలా ప్రసాద్ రావు కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “కళ్యాణం కమనీయం జీవితం”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రాజవంశీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు వీఎన్ ఆదిత్య, రాంప్రసాద్, నిర్మాత మల్లిడి సత్యన్నారాయణ రెడ్డి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా.. హీరోయిన్ సాహితి అవంచ మాట్లాడుతూ – “కళ్యాణం కమనీయం జీవితం” ఒక బ్యూటిఫుల్ ఫిలిం. అంతా ఫ్రెష్ టీమ్ ఈ మూవీకి వర్క్ చేశారు.…