ఆకట్టుకుంటున్న ‘విక్కీ ది రాక్ స్టార్’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్

'Vicky The Rockstar' First Look & Motion Poster Generate Curiosity
Spread the love

గతంలో ఎప్పుడూ టచ్ చేయని వైవిద్యభరితమైన కథాంశానికి హై ప్రొడక్షన్ వాల్యూస్ జోడించి ‘విక్కి ది రాక్ స్టార్’ అనే పేరుతో డిఫరెంట్ మూవీ తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సిఎస్ గంటా. శ్రీమతి వర్దిని నూతలపాటి సమర్పణలో స్టూడియో87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి(IAF) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సుభాష్, చరిత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ బాధ్యతలు చేపట్టారు. పలు హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన సునీల్ కశ్యప్ బాణీలు కడుతున్నారు. భాస్కర్ సినిమాటోగ్రాఫర్‌‌గా వ్యవహరిస్తున్నారు.
విక్రమ్, అమృత చౌదరి, ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఓ వైపు చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్య క్రమాలు చేస్తూనే ప్రమోషన్స్ చేపట్టి సినిమా పట్ల హైప్ పెంచేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే రాక్ స్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ వీడియో రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి రెట్టింపు చేశారు. ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ఎవ్వరూ చేయని జానర్‌ని టచ్ చేస్తూ ఈ సినిమా రూపొందించారని పోస్టర్ చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతోంది.
నేల పై సాగు చేసే రైతు ఆకాశం వైపుకి , ఆకాశమే హద్దు గా భావించే యువత నేల వైపుకి , ఒక వైపు నాగలితో రైతన్న, మరో వైపు గిటార్ తో విక్కి ది రాక్ స్టార్ , రైతు కాలికి ముద్దు పెడుతూ ఉన్న ఈ పోస్టర్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ” నీ కాళ్ళకే ముద్దులె పెట్టనా ఫార్మర్ ” అంటూ బాక్ గ్రాండ్ లో వస్తున్న లిరిక్ చాలా ఆసక్తిని రేకెత్తిస్తుంది.
ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే ‘విక్కీ ది రాక్ స్టార్’ చిత్రంలో ఏదో ఇంట్రెస్టింగ్ పాయింట్ చూపించబోతున్నారని స్పష్టమవుతోంది. చాలా డిఫరెంట్‌గా కథను ప్లాన్ చేసిన మేకర్స్ ఈ పోస్టర్‌తో ఆడియన్స్ దృష్టిని ఆకర్షించారు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ లుక్ భారీ రెస్పాన్స్ తెచ్చుకోగా.. ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
సాంకేతిక వర్గం
రచన & దర్శకత్వం : సిఎస్ గంటా
బ్యానర్: స్టూడియో87 ప్రొడక్షన్స్
నిర్మాత: ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి(IAF)
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : సుభాష్, చరిత
సంగీతం: సునీల్ కశ్యప్
సినిమాటోగ్రాఫర్‌: భాస్కర్
ఎడిటర్: ప్రదీప్ జంబిగా
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: శ్యామల చంద్ర
డిజైనర్: TSS కుమార్
పీఆర్ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు

Related posts

Leave a Comment