ఓటమి ఎన్నో పాఠాలు నేర్పుతుంది అన్నది ఎంత నిజమో ఒక మంచి స్నేహితుడు కూడా జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పిస్తాడన్నది అంతే నిజం. అలాంటి నా జీవితంలో స్నేహితుల పాత్ర మరపురానిది అన్నారు ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షులు పూల నాగయ్య. జె.ఎం.జె వ్యాయామ ఉపాధ్యాయులుగా తునికి రవికుమార్ మంచి మనసున్న వ్యక్తి అని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఫ్రెండ్స్ క్లబ్ లో జె.ఎం.జె వ్యాయామ ఉపాధ్యాయులు తునికి రవికుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో పూల నాగయ్య మాట్లాడుతూ … ప్రతి ఒక్కరి జీవితంలో జన్మదినోత్సవాలు మధురమైన స్మృతులని పేర్కొంటూ ఆ దిశగా వ్యాయామ ఉపాధ్యాయులు కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పుట్టిన రోజుని ఎవరికి వారు తమ జీవితంలో ఒక అత్యంత ముఖ్యమైన రోజుగా భావిస్తారు. ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత అటువంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. ఎందుకంటే.. ఈ ప్రపంచంలో మనిషికున్న తెలివితేటలు, సౌకర్యాలూ.. ఏ ఇతర జీవికీ లేవన్నది అక్షర సత్యం. ప్రతి ఒక్కరూ జీవితంలో సంపాదించిన వెలకట్టలేని ఆస్తులలో మిత్రుడు కూడా ఒకడు. అటువంటి మిత్రుడుకి మనస్ఫూర్తిగా ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు బాధపడుతున్నా నన్ను ఓదార్చడానికి ముందుకి వచ్చేది నువ్వే అని నాకు తెలుసు. అలాంటి నీకు జన్మదిన శుభాకాంక్షలు. నీతో స్నేహం నేను ఎన్నటికీ మర్చిపోలేని ఒక జ్ఞాపకం. అంతటి మంచి జ్ఞాపకం నాకు ఇచ్చిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. నేను ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి తికమక పడుతుంటే నాకు సరైన దారిని చూపించిన నీకు నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ కి పోటీ పెడితే అందులో సైతం బెస్ట్ ఫ్రెండ్ గా నిలిచే నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. స్నేహమంటే ఇచ్చిపుచ్చుకోవడాలు మాత్రమే కాదు.. ఒకరినొకరు బాగా అర్ధం చేసుకోవడం అని స్నేహం వల్లే తెలుసుకోగలిగాను. అంత మంచి స్నేహాన్ని పంచిన నీకు జన్మదిన శుభాకాంక్షలు. జీవితంలో గెలవగలను అన్న ధైర్యంతో పాటుగా స్ఫూర్తిని కూడా నాలో నింపిన వారిలో స్నేహితులు ముందుంటారు. అటువంటి స్నేహితుల్లో నీవు ఒకడివి. ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. స్నేహానికి నిలువెత్తు నిదర్శనం స్నేహమైతే.. ఆ స్నేహం ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం నువ్వే అన్నది సత్యం.
జీవితంలో గెలవడానికి ఉన్న ప్రాధాన్యత కేవలం స్నేహితుల మాటల వల్లే తెలుసుకోగలిగాను. నీలాంటి ప్రభావశాలి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను” అన్నారు. ఈ కార్యక్రమంలో తునికి శేఖర్ , వడ్డెమాన్ నరేందర్ తునికి గణేష్, ఘన గాని సంపత్ తునికి ప్రదీప్, కోనాపురం నాగరాజు ఇతర సభ్యులు పాల్గొన్నారు