చివరకు ఆవిష్కృతమైన 2022 సంవత్సరపు మహాద్భుతం : డిస్నీ+హాట్‌స్టార్‌పై నాన్‌స్టాప్‌గా ప్రసారం కానున్న బిగ్‌బాస్

The Biggest Surprise of 2022 IS FINALLY HERE • Bigg Boss launches its logo today on Disney+ Hotstar Telugu
Spread the love

హైదరాబాద్,09 ఫిబ్రవరి 2022 ః బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఇప్పుడు 24 గంటల వినోదాన్ని నేరుగా బిగ్‌బాస్ హౌస్ నుంచి డిస్నీ+హాట్‌స్టార్ ద్వారా అందిస్తామని వాగ్ధానం చేస్తుంది. ఈ వినోద అద్భుతం త్వరలోనే మీ అరచేతుల్లోకి రాబోతుంది. అత్యంత ఆసక్తి కలిగించే హౌస్‌మేట్స్ కలిగిన బిగ్‌బాస్ హౌస్ ఈ సారి మీ చూపు తిప్పుకోనీయదు. తెలుగు టీవీ అభిమానులు ఇప్పుడు వినోదాన్ని మరో స్థాయిలో ఆస్వాదించే రీతిలో బిగ్‌బాస్ రూపుదిద్దుకుంటుంది.
బిగ్‌బాస్ నేడు తమ లోగోను డిస్నీ+హాట్‌స్టార్ తెలుగు సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా విడుదల చేసింది. ఈ లోగో ఓ శక్తివంతమైన కళాఖండంలా ఉంటుంది. నీలం మరియు ఎరుపు రంగులు శక్తి మరియు తెలుసుకోవాలనే ఆసక్తికి ప్రతీకలుగా నిలువడమే కాదు, యూనివర్శల్ టచ్‌నూ అందిస్తాయి.
డిస్నీ+హాట్‌స్టార్ ఈ సంవత్సరం అతి పెద్ద వినోద అధ్యాయాన్ని మీ కోసం తెరువబోతుంది. ఇంకెందుకు ఆలస్యం, బిగ్‌బాస్ నాన్‌స్టాప్ కోసం సిద్ధమైపోండి !

Related posts

Leave a Comment