రవితేజ జోరు మామూలుగా లేదు!?

Raviteja Hero
Spread the love

రవితేజను ఖచ్చింతంగా మాస్ మహారాజే అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. అందుకు కారణం లేకపోలేదు. విషయాల్లోకి వెళితే.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం లేక రవితేజ సినిమాలన్నీ ఢమాల్ మన్నాయి. చాలా కాలం తర్వాత వరుస ప్రయాజయాల నుండి మాస్ కంబ్యాక్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపాడు మాస్ మాహారాజ్ రవితేజ. ఒకటి తర్వాత ఒకటి నాలుగు డిసాస్టర్ మూవీస్ తర్వాత చేసిన ‘క్రాక్’ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి అనేక ఇబ్బందులను ఫేస్ చేసి మరీ విడుదలను సొంతం చేసుకున్నా కానీ 50% ఆక్యుపెన్సీతోనే సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ వద్ద రవితేజ కెరీర్ లోనే ఆల్ టైం నంబర్ 1 చిత్రంగా నిలిచి సంచలనం సృష్టించింది. ఈ సినిమా తర్వాత రవితేజ అప్ కమింగ్ మూవీస్ ఒకటి తర్వాత ఒకటి మొదలు పెడుతూ ఫుల్ జోష్ తో సినిమాలను చేస్తూ మునుపటి రవితేజలా…సంవత్సరానికి రెండు మూడు సినిమాలతో దుమ్ము లేపాలని ప్లానింగ్ లో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ ఖిలాడీ సినిమాను దింపాలి అనుకున్నా వేవ్ ఎఫెక్ట్ వలన షూటింగ్ డిలే అవ్వడం తర్వాత టికెట్ రేట్స్ ఇష్యూ వలన ఆ సినిమా ఇప్పుడు ఫిబ్రవరి 11 న రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా… ఈ ఏడాది మార్చ్ ఎండ్ టైం లో మరో క్రేజీ మూవీనే కూడా విడుదల చేయబోతున్నాడు రవితేజ. ‘రామారావ్ ఆన్ డ్యూటీ’ పోస్టర్స్ తోనే మంచి ఇంప్రెషన్స్ ని క్రియేట్ చేయగా ఈ సినిమా మార్చ్ ఎండ్ లో రాబోతుండగా రీసెంట్ గా మరో క్రేజీ మూవీని మొదలు పెట్టాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ అనే సెన్సేషనల్ మూవీని మొదలు పెట్టగా ఈ సినిమా సెప్టెంబర్ 30న ఆడియన్స్ ముందుకు వస్తుందని పోస్టర్స్ ని ఆల్ రెడీ వదిలారు… ఇలా ఈ ఏడాది రవితేజ 3 సినిమాలతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Related posts

Leave a Comment