తెలుగుచిత్రసీమలో తదుపరి సినిమాల జాతర షురూ కాబోతోంది. పవర్ స్టార్ పవ కళ్యాణ్ ధైర్యం చేయడంతో ఫిబ్రవరి నుంచి సమ్మర్ వరకు `ఆర్ఆర్ఆర్, `రాధేశ్యామ్`, `సర్కారువారిపాట`, `భీమ్లా నాయక్`, `ఆచార్య’ చిత్రాలు ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్నాయి. కరోనా ప్రభావంతో సినిమాలన్నీ వరుసగా వాయిదా పడుతూ వస్తున్నాయి. గత రెండేళ్లుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతికి విడుదల కావాల్సిన `ఆర్ఆర్ఆర్`, `భీమ్లా నాయక్`, `సర్కారు వారి పాట`, `రాధేశ్యామ్` చిత్రాలు వాయిదా పడ్డసంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్లు సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి నెల నుంచి ప్రేక్షకులకి సినిమా పండగ తెచ్చేందుకు రెడీ అవుతున్నాయి. అందులో భాగంగా సంక్రాంతికి రావాల్సిన పవన్ కళ్యాణ్ `భీమ్లా నాయక్` వాయిదా పడిన విషయం తెలిసిందే. `ఆర్ఆర్ఆర్`, `రాధేశ్యామ్`ల కోసం ఈ చిత్రాన్ని వాయిదా వేశారు మేకర్స్. ఫిబ్రవరి 25న విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంతో పెద్ద సినిమాల పండగ ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన `రాధేశ్యామ్` అన్నీ బాగుంటే జనవరి 14న విడుదల కావాల్సింది. కానీ కరోనా మహమ్మారితో ఇది వాయిదా పడింది. తాజాగా కొత్త రిలీజ్ డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మార్చి 18న ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. నెటిజన్లు ఈ కొత్త రిలీజ్ డేట్‌ని వైరల్ చేస్తున్నారు. మెగాస్టార్ నటించిన `ఆచార్య` చిత్రం ఫిబ్రవరి 4న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా వేశారు. అయితే ఆ వెంటనే ఏప్రిల్ 1న విడుదల చేయబోతున్నట్టు కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. ఉగాది కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన మహేష్‌బాబు `సర్కారు వారి పాట` కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా ఏప్రిల్ 1న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. కానీ `ఆచార్య` అదే రోజు రాబోతున్నట్టు ప్రకటించడంలో ఈ చిత్ర రిలీజ్‌పై అనుమానాలు నెలకొన్నాయి. అయితే కొత్త డేట్ మే 13న సినిమాని విడుదల కాబోతుందనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. మరోవైపు జనవరి 7న విడుదల కావాల్సిన పాన్ ఇండియా మూవీ `ఆర్ఆర్ఆర్` కరోనా దృష్ట్యా వాయిదా పడింది. ఈ రిలీజ్ డేట్‌పై సస్పెన్స్ నెలకొంది. కానీ ఇప్పుడు కొత్త డేట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇది ఏప్రిల్‌లోనే రాబోతుందట. ఏప్రిల్ 29న విడుదల కానుందని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ అవుతుంది. మరి ఇందులో నిజమెంతోగానీ ఇప్పుడీ కొత్త రిలీజ్ డేట్లు మాత్రం నెట్టింట ట్రెండ్ అవుతుండటం విశేషం. భీమ్లా నాయక్`కి వచ్చే రెస్పాన్స్ ని బట్టి మిగిలిన సినిమాల రిలీజ్లు ఉంటాయని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.
Related posts
-
W/O అనిర్వేష్ చిత్ర బృందాన్ని అభినందించిన హీరో అల్లరి నరేష్.
Spread the love గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో గంగ సప్తశిఖర దర్శకత్వంలో వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర... -
Hero Allari Naresh Congratulates the Team of W/O Anirvesh
Spread the love Under the banner of Gajendra Productions by Venkateswarlu Merugu, Sri Shyam Gajendra, presented by... -
రాఘవరాజ్ భట్ కు జాతీయ తులసి సమ్మాన్ పురస్కారం
Spread the love ప్రముఖ కథక్ నాట్యగురు రాఘవరాజ్ భట్ కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ లభించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ...