‘ట్రిపుల్ ఆర్’కు ఎన్టీఆర్ పారితోషికం ఎంతో తెలుసా? ​

RRR Movie || NTR Still
Spread the love

టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా ఇమేజ్ కోసం తెగ ఆరాటపడుతున్నారు. ఆ ఇమేజ్ కోసం దేనికైనా రెడీయే అంటున్నారు. అలాంటి ఇమేజ్ వస్తే వంద కోట్లకు పైగా పారితోషికం వస్తుందని కలలుగంటున్నారు. కానీ అదే సమయంలో పరుగెడుతున్న కాలం గురించి మాత్రం మరచిపోతున్నారు. తాజాగా ఎన్టీఆర్ ‘ట్రిపుల్ ఆర్’ విషయానికొద్దాం.. పాన్ ఇండియా ఇమేజ్ కోసం చూసుకుంటే ఈ సినిమాకు సంబంధించి అతడికి నాలుగేళ్ల కాలం వృధా అయిపోయిందిట. కనీసం ఈ సమయంలో ఆరేడు సినిమాలు చేసినా రెండు నుంచి మూడు వందల కోట్ల పారితోషికం అయినా వచ్చి వుండేదని ట్రేడ్ వర్గాలు లెక్కలు చెబుతున్నాయి. పైగా ఆ సినిమాల్లో ఏ రెండో మూడో బ్లాక్ బస్టర్ అయినా ఈ పారితోషికం మరి కాస్త ఎక్కువే అయి వుండేదని అంటున్నారు. అయితే.. డి.వి.వి సినిమాస్ బ్యానర్ పై దర్శకదిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో డి.వి.వి దానయ్య నిర్మించిన ‘ట్రిపుల్ ఆర్’ కోసం ఎన్టీఆర్ ఏకంగా దాదాపు నలభై కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలిసింది. అంత భారీమొత్తం తీసుకొని ఈ ‘ఆర్ఆర్ఆర్’ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట! రాజమౌళి పాన్ ఇండియా ఇమేజ్ ఓ వైపు.. తన పాన్ ఇండియా ఇమేజ్ కోసం మరో వైపు.. ఈ రెండు ఆలోచించే అంత సమయాన్ని ఎన్టీఆర్ ఎంతో ఓపిగ్గా కేటాయించినట్టు తెలుస్తోంది. రాజమౌళి ద్వారా పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న డార్లింగ్ ప్రభాస్ నేడు దాదాపు 150 కోట్ల పారితోషికం స్వీకరిస్తున్నారట. అయితే..ఈ పాన్ ఇండియా ఇమేజ్ ఎంతవరకు వస్తుంది అన్నది చూడాలి మరి! ఎందుకంటే.. ‘బాహుబలి’తో ప్రభాస్ పారితోషికం 150 కోట్లకు దారితీస్తే.. అతనితో సమానంగా నటించిన దగ్గుబాటి రానా రెమ్యూనరేషన్ ఇంకా అయిదారు కోట్ల దగ్గరే ఆగింది. టాప్ హీరోయిన్ అనుష్క అయితే ఎప్పుడో ఔట్ అయిపోయిన విషయం తెలిసిందే. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా విషయం సరేసరి! అంతెందుకు..ఏ పాన్ ఇండియా ఇమేజ్ లేకుండానే ప్రిన్స్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు 60 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు. అయితే..’ట్రిపుల్ ఆర్’తో తన ఇమేజ్ ఏమేరకు పెరగుతుందో, ఎక్కడికి దారి తీస్తుందో అన్నది ఎన్ఠీఆర్ కే ఓ క్లారిటీ లేదు. ‘ఆర్ఆర్ఆ’ తరువాత తను చేయబోయే చిత్రం ఎలా వుండాలి అన్నది ఇంకా ఫిక్స్ చేసుకోలేకపోతున్నారట! ఈ కారణంగానే త్రివిక్రమ్ తో చేయాల్సిన సినిమాను సైతం వదులుకున్నట్టు సినీవర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి! పాన్ ఇండియా ఇమేజ్ కోసం ఎన్ఠీఆర్ చేసిన ఈ సాహసం చివరకు ఎటు వైపునకు లాక్కెళుతుందో..!!?

Related posts

Leave a Comment