(టాలీవుడ్ టైమ్స్ ప్రతినిధి – ఆలేరు )
పాలనలో స్వార్దం లేకుండా నిజాయితీ గా పరిపాలన కొనసాగిస్తే దేశ ప్రజలు అంతే విధంగా బాగుంటారని బిజెపి మహబూబ్‌నగర్ జిల్లా ఇంచార్జి ప్రేమ్ రాజ్ యాదవ్ అన్నారు. ఆలేరు పట్టణంలో రెండు రోజుల బిజెపి రాజకీయ శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి మంగళవారం హాజరైన ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రధాని మోడీ దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమానంగా నిధులను కేటాయిస్తూ నిజాయితీ పాలనకు నిదర్శనంగా నిలుస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోఅనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు కోసం కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తున్నా కేసీఆర్ ప్రభుత్వం పధకాలకు తమ సొంత పేరు పెట్టుకొని ప్రజలకు అందిస్తుందని చెప్పారు.మోడీ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.తెలంగాణ లోని పల్లెల్లో, పట్టణాల్లో, నగరాల్లో నిర్మించిన కడుతున్న వైకుంఠధామాలు, సిసి రోడ్లు డంపింగ్ యార్డులే కాకుండా సీఎం కేసీఆర్ గొప్పగా చెప్పుకుంటున్న రైతు వేదికల నిర్మాణంలో కూడా కేంద్రం వాటా ఉందని వివరించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రం భాగస్వామ్యం ఏమీ లేదు అన్నట్టు చెప్పడం సిగ్గుచేటని, పల్లెల్లో పట్టణాల్లో నగరాల్లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమంలో కేంద్రం పాత్ర ఏ మేరకు ఉందో తెలియచెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని నాయకులు ,కార్యకర్తలు ఐక్యంగా ప్రభుత్వ పధకాలను ప్రజలలోకి తీసుకెళ్లి బిజెపి పార్టీ బలోపేతానికి కృషి చేసి తెలంగాణ లో అధికారమే ధ్యేయంగా పనిచేయాలని దిశానిర్దేశం చేసారు.
ఈ కార్యక్రమంలో, పట్టణ అధ్యక్షుడు బడుగు జాంగిర్, ప్రధాన కార్యదర్శులు పులిపుల మహేష్,బందెల సుభాష్ కౌన్సిలర్ సంగు భూపతి, సీనియర్ నాయకులు తోట మల్లయ్య, జంపాల శ్రీనివాస్ ,మల్ రెడ్డి నరసింహారెడ్డి, వడ్డెమాను కిషన్ ఎనగందుల సురేష్, కటకం నందము, తునికి దశరథ, సముద్రాల శ్రీనివాస్, పసుపు నూరి వీరేశం, ఉపాధ్యక్షులు జెట్టు సిద్ధులు, నంద గణేష్, పస్తం ఆంజనేయులు, ఎగిడ సిద్ధులు, కళ్లెం రాజు, కటకం రాజు, ఎలగందుల రమేష్, పత్తి రాములు తదితరులు పాల్గొన్నారు.