మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది : అనసూయరెడ్డి

Anasuyareddy helath
Spread the love

చిన్నపిల్లల దగ్గరనుంచి పెద్దవాళ్ళ వరకు ఇప్పుడున్న సమస్యల్లో బరువు పెరగడం అనేది అతి పెద్ద సమస్యగా మారింది చాలా పెద్ద సమస్యగా మారింది. కానీ ఈ బరువు తగ్గే విధానంలో మనం ఏం కోల్పోతున్నాం అనేది ఆలోచించాలి. ఎందుకంటే బరువు తగ్గితే ఈ సమస్య తగ్గిపోతుంది అని అందరం అనుకుంటాం కానీ.. ఈ విధానంలో మనం బరువు ఒకటే కాకుండా మన పోషణ కూడా కోల్పోతున్నాం అని మన అందరం గుర్తించాలి. ఎలా అంటే పోషణ అనేది మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం అందుకే చాలామంది బరువు తగ్గే ఈ క్రమంలో పోషణ కూడా కోల్పోతారు. చాలా కష్టపడి 3 నుండి నాలుగు కేజీల వరకు బరువు తగ్గుతారు కానీ మళ్లీ మామూలుగా తినడం వల్ల బరువు పెరుగుతారు అయితే దీనికి శాశ్వత పరిష్కారం ఏదైనా ఉందా అని మనం ఆలోచించాలి. ఇలా ఆలోచించే క్రమంలో మన బరువుని న్యూట్రిషన్ తో పోల్చాలి మన శరీరంలో పోషణ నింపుతూ బరువు తగ్గాలి ఇలా చేయకపోవడం వల్ల చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు. మన శరీరానికి అనుగుణంగా ఉన్న ఆహారం ఏదైతే ఉందో దాన్ని మనం ఎంచుకోవాలి మన శరీరంలో ఉందో తెలుసుకోవాలి దాని తర్వాత మనం పోషణతో నింపాలి ఈ క్రమంలో మన బరువు సులభంగా తగ్గుతుంది కానీ మనం ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో దాన్ని మనం ఒక్కసారి చూసుకోవాలి. మనం తినే ఆహారంలో పోషణ ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి కానీ ఈ పోషణ ఎలా నింపాలి అనేది మనం తెలుసుకోవాలి. ఎలా అంటే మనం రోజు తీసుకునే ఆహారం చాలా జీవంతో కూడుకున్నదై ఉండాలి. మనం రోజూ తినే ఆహారం చాలా నాచురల్ గా ఇచ్చినవి వండుకొని తినాలి మనం ఉపయోగించే వంట నూనె మార్చుకోవాలి రిఫైన్డ్ ఆయిల్ యూస్ చేయడం వల్ల మన ఆరోగ్యం క్రమంగా తగ్గడం మొదలవుతుంది ఇలా ఒక కుటుంబంలో నెలకి ఎంత ఆయిల్ ఉపయోగించాలో తెలుసుకోవాలి తరువాత మనం తీసుకునే ఆహారం లోకల్ మార్కెట్లో ఆకుకూరలు పండ్లు ధాన్యాలు తీసుకోవడం ఎంచుకోవాలి వీలైనంతవరకూ కల్తీ ఆహారం బయట రెస్టారెంట్స్ ఎక్కువ జంక్ ఉన్న ఆహారాన్ని తీసుకోవటం మానేయాలి ఇంకా ఒక కొత్త పద్ధతి ఉంది బరువుని మనం ఎప్పుడు క్రమంలో ఉంచుకోవటానికి అది మనం కల్చర్ లో ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి దీనివల్ల మనకి ఎటువంటి జబ్బులు రాకుండా బరువు పెరగకుండా మనం కాపాడుకోవచ్చు మన శరీరంలోకి పంపించే ఆహారం మన ఆరోగ్యాన్ని ఆయుష్షును పెంచేలా ఉండాలి కానీ ఇప్పుడు రోజుల్లో మనం తీసుకునే ఆహారం భిన్నంగా ఉంది. అందుకే మనం ఎక్కువ అనారోగ్యానికి బరువు పెరగడం ఇంకా చాలా ప్రాబ్లమ్స్ కి గురికావడం జరుగుతుంది అందుకే మనం కల్చర్ ని ఇప్పుడు మరువకూడదు దీని వల్ల మన ఆరోగ్యం పడకూడదు అందుకే మన ఆరోగ్యం ఎప్పుడూ మన చేతుల్లో వుంచుకోవాలి అప్పుడే మనం చాలా సంతోషంగా ఉంటాం.
Anasuya reddy
Founder, healthy living club.
Nutrition and dietition

Related posts

Leave a Comment