ఆలేరులో రోశయ్యకు ఘన నివాళి
ఆలేరు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, మంత్రిగా, తమిళనాడు గవర్నర్గా, ప్రజా ప్రతినిధిగా అర్ధశతాబ్ధానికి పైగా ప్రజలకు సేవలందించిన కొణిజేటి రోశయ్య మృతి పట్ల యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఇందిరా భవన్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారు పరమపదించిన సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్బంగా యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి మాట్లాడుతూ .. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరిస్తూ, పరిపాలనా దక్షుడిగా పేరు పొందిన రోశయ్య మృతి తెలుగు వారికి తీరనిలోటన్నారు. రాజకీయాల్లో ఉన్నత విలువలు కలిగిన వ్యక్తిని తెలుగు రాష్ట్రాలు కోల్పోయామని అన్నారు. రోశయ్య మరణం అత్యంత బాధాకరమన్నారు. దివంగత నేత వైస్ రాజశేఖరరెడ్డికి రోశయ్య అత్యంత సన్నిహితులన్నారు. ఓర్పు, నేర్పు కలిగిన మంచి వక్తగా రోశయ్య అందరి అభిమానాన్ని చూరగొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.
ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో టౌన్అ ధ్యక్షులు ఎం.ఏ. ఎజాస్, ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ నీలం వెంకటస్వామి, చింతల పాని శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఉప్పలయ్య, టౌన్ అధ్యక్షురాలు పాము అనిత, టౌన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, దడిగె అనిల్ కాంగ్రెస్ నాయకులు పల్లె రమేష్, లోకేష్, సంపత్, భాస్కర్, ఎన్ ఎస్ యు ఐ మండలాధ్యక్షులు విక్రమ్ ప్రభు, కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యుఐ నాయకులు పాల్గొన్నారు
.