సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా నిర్మించనున్నారు. దీనికి ఇద్దరు యువకులు హరి–హరీష్‌దర్శకత్వం వహించనున్నారు. శ్రీదేవి మూవీస్ సంస్థలో ప్రొడక్షన్ నెం 14గా తెరకెక్కనున్నఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుంచి ప్రారంభం కానుంది. విజయదశమిసందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ‘‘విభిన్న కథాంశంతో ఈ సినిమా తీస్తున్నాం. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రమిది. బాలకృష్ణగారితో ‘ఆదిత్య 369’ తీశాను. ఆయనతో మరోమూడు చిత్రాలు చేశాను . నానితో ‘జెంటిల్‌మన్’, సుధీర్‌బాబుతో ‘సమ్మోహనం’ నిర్మించాను . ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. చాలాకొత్తగా ఉంటుందీ సినిమా. సమంతగారు కథ వినగానే ఎగ్జైట్ అయ్యారు. వెంటనే ఓకేచెప్పారు. హరి, హరీష్ దర్శక ద్వయాన్ని ఈ సినిమాతో పరిచయం చేస్తున్నాం. నవంబర్‌లోతెలుగు, తమిళ భాషల్లో చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అని చెప్పారు. త్వరలో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.
Related posts
-
రాఘవరాజ్ భట్ కు జాతీయ తులసి సమ్మాన్ పురస్కారం
Spread the love ప్రముఖ కథక్ నాట్యగురు రాఘవరాజ్ భట్ కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ లభించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ... -
చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ అవుతూనే ఉంటుంది.. “ఒక పథకం ప్రకారం” దర్శక, నిర్మాత వినోద్ కుమార్ విజయన్
Spread the love సంచలన దర్శకుడు పూరి జగన్నాధ్ సోదరుడు సాయిరామ్ శంకర్ నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ “ఒక... -
Oka Pathakam Prakaaram will Maintain Suspense Till The End: Director Vinod Kumar Vijayan
Spread the love Sai Ram Shankar, the younger brother of sensational director Puri Jagannadh, is starring in...