మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గత నెల10న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలై అపోలో ఆసుపత్రి వైద్యుల సమక్షంలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. కాగా.. తేజ్ పూర్తిగా కోలుకొని ఈ రోజు (అక్టోబర్ 15) ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా తెలిపారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలైన తేజ్ అపోలో ఆసుపత్రి వైద్యుల సమక్షంలో దాదాపు 35 రోజులు చికిత్స పొందారు. ఈ నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకొని ఇంటికి వచ్చాడని మెగా స్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. “ప్రమాదం నుంచి బయట పడిన తేజ్‌కు ఇది పునర్జన్మ” అంటు ట్వీట్లో మెగాస్టార్ పేర్కొన్నారు. అలాగే ఈరోజు తేజ్ బర్త్ డే సందర్భంగా మెగాస్టార్ శుభాకాంక్షలు తెలిపారు.
పవన్ కళ్యాణ్: సాయిధరమ్ తేజ గత నెల్లో బైక్ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన డాక్టర్స్ సమక్షంలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఆయన తిరిగి కోలుకొని ఎప్పటిలాగానే షూటింగ్స్ లో పాల్గొనాలని మెగా ఫ్యామిలీ మెంబర్స్, అభిమానులు కోరుకున్నారు. అయితే నేడు (శుక్రవారం) సాయితేజ పుట్టిన రోజు సందర్బంగా ఆయన పూర్తిగా కోలుకున్నట్టు మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ సైతం సాయిధరమ్ తేజ పూర్తి ఆరోగ్యవంతుడై ఇంటికి చేరుకున్నట్టు ప్రకటించారు. అనుకోని రీతిలో ప్రమాదం బారిన పడి గత నెలరోజులుగా ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న సాయిధరమ్ తేజ్ కోలుకొని ఈ రోజు క్షేమంగా ఇంటికి చేరాడు. విజయదశమి పర్వదినాన తేజ్ ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావడం మా కుటుంబం అందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ రోజే తేజ్ పుట్టిన రోజు. భవిష్యుత్తులో మరిన్ని విజయాలు అందుకొని ప్రేక్షకుల ప్రేమాభిమానలు మరింతగా పొందాలని, శక్తి స్వరూపిణిని ప్రార్ధిస్తున్నాను. తేజ్ ఆసుపత్రిలో చేరినప్పటినుంచి అభిమానులు ఎంతో బాధపడి , తేజ్ క్షేమంగా ఉండాలని కోరకున్నారు. ఆలయాల్లో ప్రార్ధనా మందిరాల్లో పూజలు చేశారు. వారందరి ప్రార్ధనలు ఫలించాయి. వారందరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.. అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.