సూపర్ స్టార్ మహేష్ బాబు – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. వీళ్లిద్దరి కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం పోకిరి. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసింది. సరికొత్త రికార్డులను సృష్టించింది. ఆతర్వాత మహేష్ – పూరి కలసి చేసిన మరో సినిమా బిజినెస్ మేన్. ఈ సినిమా కూడా రికార్డులను సృష్టించింది. ఇలా మహేష్, పూరి కలిసి చేసిన పోకిరి, బిజినెస్ మేన్ చిత్రాలు బ్లాక్ బస్టర్స్ అవ్వడంతో వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ కోసం అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు.
మహేష్ తో పూరి జగన్నాథ్.. జనగణమన సినిమా చేయాలి అనుకున్నారు. కథ రెడీ చేశారు. మహేష్ కి కథ చెప్పారు. తనకు నచ్చిందని చెప్పారు మహేష్. అయితే.. ఏమైందో ఏమో కానీ ఇప్పటి వరకు జనగణమన సెట్స్ పైకి వెళ్లలేదు. ఆతర్వాత పూరి.. ఈ చిత్రాన్ని వెంకీతో చేయాలి అనుకున్నారు. ఆయనకి కూడా కథ బాగా నచ్చింది కానీ.. బడ్జెట్ కారణాల వలన సెట్స్ పైకి వెళ్లలేదు. ఆతర్వాత పూరి.. కేజీఎఫ్ స్టార్ యష్ తో చేయాలి అనుకున్నారు. ఆయనకు కూడా కథ నచ్చింది. కానీ.. ప్రాజెక్ట్ సెట్ కాలేదు. ఆతర్వాత పవన్ కళ్యాన్ తో కూడా చేయాలి అనుకున్నారు కానీ ముందుకు వెళ్లలేదు.
ఇలా జనగణమన సినిమా ఎప్పటి నుంచో పెండింగ్లోనే ఉంది. ఇదిలా ఉంటే.. ఈ రోజు పూరి జగన్నాథ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మహేష్ బాబు పూరి జగన్నాథ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది. దీంతో మరోసారి జనగణమన ప్రాజెక్ట్ వార్తల్లోకి వచ్చింది. మరి.. ఎప్పటి నుంచో వెయిటింగ్ లో ఉన్న జనగణమన చిత్రాన్ని మహేష్.. పూరితో ఇప్పటికైనా చేస్తారా..? అని నెటిజన్లు అడుగుతున్నారు. అంతా సెట్ అయి ఈ క్రేజీ ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అవుతుందేమో చూడాలి.