కీర్తి సురేష్‌కు మిస్‌ ఇండియా టీమ్‌ విశెష్

miss india team birthday wishes to keerthi suresh
Spread the love

‘మహానటి’ సినిమాలో తన అద్భుతమైన నటనతో జాతీయ గుర్తింపును సంపాదించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు కీర్తి సురేష్‌. చక్కటి రూపం, హావభావాలు కీర్తి సొంతం. ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ఒదిగిపోతూ తన నటనతో పాత్రకు ప్రాణం పోసే కీర్తి సురేష్ టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం ‘మిస్‌ ఇండియా’. శనివారం(అక్టోబర్‌ 17) కీర్తిసురేష్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందిస్తోంది ‘మిస్‌ ఇండియా’ యూనిట్‌. మహానటి తర్వాత కీర్తిసురేష్‌ నటించిన తెలుగు చిత్రం ‘మిస్‌ ఇండియా’. నరేంద్రనాథ్‌ దర్శకత్వంలో ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్‌ పతాకంపై మహేష్ కోనేరు సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

కీర్తిసురేష్‌ నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌లో హై బడ్జెట్‌తో రూపొందించిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన పాట, టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. వచ్చే నెలలో ఈ సినిమా విడుదల చేయడానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. కీర్తి సురేష్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తున్న చిత్రమిది. జగపతిబాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్‌, భానుశ్రీ మెహ్రా, నదియా, పూజిత పొన్నాడ, కమల్ కామరాజు తదితరులు ఇందులో నటిస్తున్నారు.

Related posts

Leave a Comment