అక్టోబర్ 15న నాగశౌర్య-రీతువర్మల ‘వరుడు కావలెను‘ విడుదల

naga Shaurya,Ritu Varma stared Varudu Kaavalenu releasing in October 15 on the ocassion of Dussehra.
Spread the love

అక్టోబర్ 15న నాగశౌర్య-రీతువర్మల ‘వరుడు కావలెను‘ విడుదల
ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను‘. ఈ చిత్రాన్ని విజయదశమి పర్వదినాన అక్టోబర్ 15 న విడుదల చేయనున్నట్లు నేడు అధికారికంగా ప్రకటిస్తూ ఓ ప్రచారచిత్రాన్ని విడుదల చేశారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదల అయిన ‘‘‘కోలకళ్ళే ఇలా గుండే గిల్లే ఎలా’, అలాగే ‘దిగు దిగు నాగ’, ‘‘మనసులోనేనిలిచి పోకె మైమరపుల మధురిమ పాటలు బహుళ ప్రజాదరణ పొందినాయి. దీనికి ముందు ఇప్పటివరకు విడుదల చేసిన చిత్రాలు, ప్రచార చిత్రాలు వంటి వాటికి కూడా ప్రేక్షకాభిమానులనుంచి ఎన్నో ప్రశంసలు లభించాయి. సామాజిక మాధ్యమాలలో కూడా వీటికి ప్రాచుర్యం లభించింది.
ప్రస్తుతం చిత్ర నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రేమ, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో ‘వరుడు కావలెను‘ చిత్రం మిమ్మల్ని అలరించటానికి మీముందుకు వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా దసరా కానుకగా అక్టోబర్ 15 న విడుదల అవుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు. ఈ చిత్రానికి మాటలు: గణేష్ కుమార్ రావూరి, ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్,ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, పి.ఆర్.ఓ. లక్ష్మీవేణుగోపాల్ సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
నిర్మాత: సూర్య దేవర నాగవంశి
కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య

Related posts

Leave a Comment