హైదరాబాద్‌లో నితిన్‌ మూవీ షూటింగ్‌

nithiin check movie shooting in Hyderabad
nithiin check movie shooting in Hyderabad
Spread the love

యూత్ స్టార్ నితిన్, క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్లో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘చెక్’. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ ఈనెల 10 నుండి హైదరాబాద్‌లో జరుగుతోంది.

ఈ సందర్భంగా నిర్మాత వి. ఆనందప్రసాద్ మాట్లాడుతూ… “చెక్ టైటిల్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నటుడిగా నితిన్ స్థాయిని పెంచే చిత్రమిది. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి చదరంగం నేపథ్యంలో చాలా విభిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, సాయి చంద్, సంపత్ రాజ్ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. నవంబర్ 5 వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది, దాంతో దాదాపుగా సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది.” అని తెలిపారు.

పోసాని కృష్ణ మురళి, మురళి శర్మ, హర్షవర్ధన్, రోహిత్, సిమ్రాన్ చౌదరి తదితరులు ఈ చిత్రంలో ప్రధాన తారాగణం.