స్వీటీ అనుష్క, మాధవన్, మైఖేల్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజ్ వంటి వారు నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. దర్శకుడు హేమంత్ మధుకర్ రూపొందించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం చిత్రీకరణ ఎప్పుడో జరుపుకున్నప్పటికీ.. థియేటర్స్‌లోకి వచ్చే టైమ్‌కి కరోనా రూపంలో థియేటర్లు మూతపడ్డాయి. ఆ తర్వాత థియేటర్స్ కోసం కొంతకాలం వెయిట్ చేసినా.. సరైన క్లారిటీ లేకపోవడంతో అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ద్వారా ఈ చిత్రం గాంధీ జయంతి రోజు విడుదలైంది. అయితే విడుదలైన తర్వాత కాస్త నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. ఓవరాల్‌గా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వారికి లాభసాటి ప్రాజెక్ట్‌గా నిలిచిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వారు విడుదల చేసే సమయానికి మార్కెట్‌లో సరైన సినిమా లేకపోవడంతో.. అందరూ ఈ సినిమాని చూసేందుకు ఇంట్రస్ట్ చూపించారని, తద్వారా మంచి వ్యూస్ వచ్చాయని తాజాగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తుంది.
కథకి ఆసక్తికరమైన స్ర్కీన్‌ప్లే లేకపోవడంతో టాక్ వీక్‌గా ఉన్నా.. టెక్నికల్‌గా రిచ్‌గా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించారని, తద్వారా ఈ ప్రాజెక్ట్ అమెజాన్ ప్రైమ్ వారికి లాభాలను తెచ్చిపెట్టిందనే టాక్.. ఇప్పుడీ సినిమాపై మరింత ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తుంది. అసలైతే ఈ సినిమా మొదటి నుంచి వార్తల్లో ఉంటూనే ఉంది. అనుష్క, మాధవన్ కాంబినేషన్.. అంజలి, షాలినీ పాండే వంటి యంగ్ హీరోయిన్లు, ప్రమోషన్స్ వంటివన్నీ.. సినిమా విడుదలకు ముందు మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. ఆ హైప్‌కు తగినట్లే.. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను భారీ ఆఫర్‌కు దక్కించుకుంది.
దీంతో ఈ సినిమా విడుదల విషయంలో కన్ఫ్యూజ్ అయిన నిర్మాతలకు చివరికి ఈ చిత్రం సేఫ్ ప్రాజెక్ట్‌గానే నిలిచింది. టాక్ చూసి కష్టమే అనుకున్న అమెజాన్ ప్రైమ్ వారికి అనూహ్యంగా వ్యూస్ రావడంతో వారు కూడా సంతోషంగానే ఉన్నారు. ఇక నటీనటులు మొదటి నుంచి వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. టాక్‌తో సంబంధం లేకుండా మొదటి నుంచి ఈ చిత్రంపై ఎంతో నమ్మకం పెట్టుకున్న దర్శకుడు.. తను అనుకున్న విజయం ఈ చిత్రం సాధించడంతో పాటు, తన దర్శకత్వ ప్రతిభకు మంచి మార్కులు పడటంతో ఆయన కూడా ఆనందం వ్యక్తం చేస్తూ.. తన తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నారు.