మర్డర్, మిస్టరీ, థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న ‘గ్రేట్ శంకర్’

greater shankar telugu movie still
Spread the love

శ్రీ లగడపాటి భార్గవ సమర్పణలో లగడపాటి శ్రీనివాస్ శ్రీ ఎల్.వి.ఆర్ సంస్థ నుండి వస్తున్న చిత్రం “గ్రేట్ శంకర్”. మలయాళంలో అఖండ విజయం సాధించిన “మాస్టర్ పీస్” అను చిత్రాన్ని “గ్రేట్ శంకర్” గా మన తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి మన తెలుగు ప్రేక్షకులకు ఎన్నో మంచి చిత్రాలలో నటించి తెలుగు హృదయాలలో స్థానం సంపాదించుకున్నాడు. క్రాక్, నాంది లాంటి విభిన్న చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఈ చిత్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏసీపీ క్యారెక్టర్ గా కీలక పాత్రలో నటిస్తున్నారు. మంచి కథాబలం తో మర్డర్, థ్రిల్లర్ ,మిస్టరీ తో అత్యంత ఉత్కంఠ భరితంగా సాగే కథనంతో ప్రేక్షకులను అలరించనుంది.
ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందించారు. ఉన్ని ముకుందన్ (భాగమతి ఫేం),పూనమ్ బజ్వా తదితర నటీ,నటులు నటించిన ఈ చిత్రం తెలుగులో కూడా పెద్ద హిట్ట వుతుంది అని నిర్మాతలు లగడ పాటి శ్రీనివాస్ అన్నారు
నటీనటులు
మమ్ముట్టి, వరలక్ష్మి శరత్ కుమార్ ,ఉన్ని ముకుందన్ (భాగమతి ఫేం), పూనమ్ బజ్వా తదితరులు
సాంకేతిక నిపుణులు
సమర్పణ :- శ్రీ లగడపాటి భార్గవ
బ్యానర్ :-శ్రీ ఎల్.వి.ఆర్ ప్రొడక్షన్స్
చిత్రం :- గ్రేట్ శంకర్
నిర్మాత :- లగడపాటి శ్రీనివాస్
డైరెక్షన్ :-అజయ్ వాసుదేవ్
స్టోరీ :-ఉదయ కృష్ణ
మ్యూజిక్ :- దీపక్ దేవ్
డిఓపి :- వినోద్ వల్లంపాటి
పి ఆర్.ఓ :- మధు వి.ఆర్

Related posts

Leave a Comment