వైభవంగా ‘ముగ్గురు మొనగాళ్లు’ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌

mugguru monagallu movie function still
Spread the love

శ్రీ‌నివాస్‌రెడ్డి, దీక్షిత్‌ శెట్టి (కన్నడ హిట్‌ మూవీ ‘దియా’ ఫేమ్‌), వెన్నెల రామారావు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతోన్న చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు’. చిత్ర మందిర్ బ్యాన‌ర్‌పై అభిలాష్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో పి.అచ్యుత రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధ‌వారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో ఘనంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో…
దర్శకేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు(వీడియో ద్వారా) మాట్లాడుతూ ‘‘నటుడిగా అంద‌రికీ సుప‌రిచితుడైన రామారావుగారు నిర్మించిన ‘ముగ్గురు మొనగాళ్లు’ చిత్రం ఒక‌ప్పుడు చిరంజీవిగారితో నేను చేశాను. అదే టైటిల్‌తో, డిఫ‌రెంట్ క‌థ‌తో సినిమా చేశారు. టీజ‌ర్‌, ట్రైల‌ర్ చూశాను. సినిమా చాలా బావుంది. సంగీతం, డైరెక్ష‌న్ అన్నీ బావున్నాయి. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్‌’’ అన్నారు.
తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస యాదవ్ (వీడియో ద్వారా) మాట్లాడుతూ ‘‘తొలిసారి చెవులు విన‌ప‌డ‌ని, మాట‌లు మాట్లాడ‌లేని, క‌ళ్లు క‌న‌ప‌డ‌ని వ్య‌క్తులను ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా పెట్టి సినిమా చేయ‌డం కొత్త విష‌యం. ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ అభిలాష్ రెడ్డి, నిర్మాత వెన్నెల రామారావుని అభినందిస్తున్నాను. ఇండ‌స్ట్రీలోకి కొత్త జ‌న‌రేష‌న్ రావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. అలాగే మంచి మెసేజ్ సినిమాలు రావాల్సిన అవ‌స‌రం ఉంది. ఓ మంచి పాయింట్‌తో సినిమా చేసిన టీమ్‌ను అభినందిస్తూ.. త‌ప్ప‌కుండా ప్ర‌భుత్వం కూడా అంద‌రికీ స‌పోర్ట్‌ను అందిస్తుంద‌ని తెలియ‌జేస్తున్నాను’’ అన్నారు.
ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ రెడ్డి(వీడియో ద్వారా) మాట్లాడుతూ ‘‘‘ముగ్గురు మొనగాళ్లు’ మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి సందేశం ఉన్న చిత్రం. ప్ర‌తి ఒక్క‌రూ ఈ సినిమా చూసి ఎంక‌రేజ్ చేయాల‌ని కోరుకుంటూ.. వెన్నెల రామారావు, అభిలాష్ రెడ్డి అండ్ టీమ్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను’’ అన్నారు.
స్టార్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్(వీడియో ద్వారా) మాట్లాడుతూ ‘‘‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమా డైరెక్టర్ అభిలాష్ నా దగ్గరే వర్క్ చేశాడు. తనకు సినిమా హిట్టై చాలా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. అలాగే, తనకు డైరెక్టర్‌గా అవ‌కాశం ఇచ్చిన రామారావుగారికి థాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమా హిట్‌తో రామారావుగారికి మంచి లాభాలు రావాలి. ట్రైల‌ర్ చూశాను. చాలా హిలేరియ‌స్‌గా ఉంది. సినిమా అంత‌క‌న్నా బావుంటుంద‌ని అనుకుంటున్నాను’’ అన్నారు.
బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ మాట్లాడుతూ ‘‘నాకు నిర్మాత రామారావుగారితో చాలా మంచి అనుబంధం ఉంది. ఆయ‌న్ని అన్న అని పిలుస్తుంటాను. నా ద‌గ్గ‌ర ఏమీ లేని రోజుల్లోనే నాకెంతో స‌హాయం చేసిన వ్య‌క్తి. నీ కెరీర్‌కి ఏమైనా నేనున్నారా! అంటూ ఎప్పుడూ చెబుతుంటారు. ఆయ‌న‌కు సినిమా అంటే ఎంతో ప్రేమ‌. ఆ ప్రేమ‌తోనే త‌న ద‌గ్గ‌రున్న డ‌బ్బుల‌న్నీసినిమాలకే పెట్టేశారు. అలాంటి మంచి మ‌న‌సున్న వ్య‌క్తులు చాలా అరుదుగా ఉంటారు. ఆయ‌న సినిమాల్లో క‌చ్చితంగా న‌టిస్తాను. ఇక ముగ్గురు మొన‌గాళ్లు సినిమా విష‌యానికి వ‌స్తే.. సినిమాలో చాలా ఫ‌న్ ఉంటుంది. త‌ప్ప‌కుండా సినిమా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు.
అరియానా మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర చేసిన శ్రీనివాస‌రెడ్డిగారి గురించి ఓ మాట చెప్పాలి. నేను యాంక‌ర్‌గా ప‌నిచేస్తున్న‌ప్పుడు ఫ‌స్ట్ ఇంట‌ర్వ్యూ చేసిన సెల‌బ్రిటీ శ్రీనివాస‌రెడ్డిగారే. ఆ ఇంట‌ర్వ్యూ చేయ‌డానికి నేనెంతో టెన్ష‌న్ ప‌డుతూ ఇంట‌ర్వ్యూ పూర్తి చేశాను. ఇంట‌ర్వ్యూ పూర్త‌యిన త‌ర్వాత‌, పిట్ట కొంచెం కూత ఘ‌నం.. మూడేళ్ల త‌ర్వాత ఈ అమ్మాయి మంచి రేంజ్‌కు చేరుకుంటుంద‌ని అప్పుడాయ‌న మా డైరెక్ట‌ర్‌గారితో అన్నారు. ఆయ‌న అన్న‌ట్లుగానే నాలుగేళ్ల‌కు ఇలా మీ ముందు నిల‌బ‌డి ఉన్నాను. అంతా ఆశీర్వాద‌మే. రామారావుగారు రిటైర్ కాకూడ‌దు.. పెద్ద నిర్మాత కావాలి. ఈ సినిమా చాలా పెద్ద హిట్ సాధించింది’’ అన్నారు.
రైట‌ర్ బి.వి.ఎస్‌.ర‌వి మాట్లాడుతూ ‘‘చిరంజీవిగారు, రాఘ‌వేంద్రరావుగారు కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘ముగ్గురు మొనగాళ్లు’ చిత్రాన్ని నేను, రామారావుగారు క‌లిసి బళ్లారిలోని ముబార‌క్ థియేట‌ర్‌లోనే క‌లిసి చూశాం. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంద‌ని మ‌న‌స్ఫూర్తిగా న‌మ్ముతున్నాను. ఇప్పుడాయ‌న అదే టైటిల్‌తో సినిమా చేశారు. ఈ సినిమా టైటిల్‌లోనే ఓ ఎట్రాక్ష‌న్ ఉంటుంది. ముగ్గురు డిఫ‌రెంట్లీ ఎబుల్డ్ ప‌ర్స‌న్స్‌తో ఓ డిఫ‌రెంట్ సినిమా చేశార‌ని మ‌న‌కు టీజ‌ర్‌, ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఛాలెంజింగ్ రోల్స్‌తో చేసిన ఈ సినిమా మ‌రింత ఆక‌ట్టుకుంటుంద‌ని న‌మ్ముతున్నాను. మేం చ‌దువుకునే రోజుల్లో, రామారావుగారు యాక్టింగ్ స్టార్‌. అలా న‌ట‌న‌పై ప్యాష‌న్‌తో సినీ ఎంట్రీ ఇచ్చి, స్టూడియో ర‌న్ చేస్తూ సినిమా చేశారు. దీంతో పాటు మ‌రో రెండు సినిమాల‌ను కూడా నిర్మిస్తున్నారు. డైరెక్ట‌ర్ అభిలాష్‌కు ఈ సినిమా మంచి పేరు తెచ్చి పెద్ద డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకోవాలి. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫ‌ర్ అంజితో నాకు మంచి అనుబంధం ఉంది. మేమిద్ద‌రం ఒకేసారి కెరీర్‌ను స్టార్ట్ చేసిన వాళ్లం. ఆయన వర్క్ చేసిన ఈ సినిమా, ఇప్పుడాయన డైరెక్ట్ చేస్తున్న సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్ట‌ర్ సురేశ్ బొబ్బిలి మాట్లాడుతూ ‘‘రామారావుగారు యాక్టర్‌గా మ‌న‌కు తెలుసు. కానీ, ఆయ‌న‌కు సొంతంగా సినిమా చేయాల‌ని ఆలోచ‌న ఎప్ప‌టి నుంచో ఉండేది. మంచి టెక్నీషియ‌న్స్‌ను ప‌రిచ‌యం చేయాల‌నుకునేవారు. ఆ ఆలోచ‌న‌ల‌తోనే ఈ ముగ్గురు మొన‌గాళ్లు సినిమాను చేశారు. ఈ సినిమాలో నాకు అవ‌కాశం ఇచ్చిన ఆయ‌న‌కు, డైరెక్ట‌ర్ అభిలాష్ రెడ్డిగారికి థాంక్స్‌’’ అన్నారు.
సినిమాటోగ్రాఫ‌ర్ గ‌రుడ‌వేగ అంజి మాట్లాడుతూ ‘‘ చిరంజీవిగారి ‘ముగ్గురు మొనగాళ్లు’ త‌ర్వాత ఆ టైటిల్ పెట్టారంటే సినిమాపై ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో తెలుస్తుంది. ఈ సినిమాకు శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ శెట్టి, నిర్మాత రామావు ముగ్గురు మొన‌గాళ్లు. అభిలాష్ రెడ్డి ప‌క్కా స్క్రిప్ట్‌తో రావ‌డంతో సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేశాం. న‌టీన‌టులు, ఆర్టిస్టులు కో ఆప‌రేష‌న్‌తో సినిమాను కంప్లీట్ చేశాం. హిలేరియ‌స్ కామెడీ మూవీ. థియేట‌ర్‌లో సినిమాను ఎంజాయ్ చేయండి. నిర్మాత‌గా రామారావుగారు పెద్ద స‌క్సెస్ సాధించి చాలా సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.
నిర్మాత, నటుడు పి.అచ్యుత రామారావు మాట్లాడుతూ ‘‘నేను నిర్మించిన మూడు సినిమాల్లో న‌టించిన టి.ఎన్‌.ఆర్‌గారు ఇప్పుడు మ‌న మ‌ధ్య‌లేక‌పోవ‌డం ఎంతో బాధాక‌రం. చాలా మంచి వ్య‌క్తి. ఆయ‌న కుటుంబానికి మేమంద‌రం స‌పోర్ట్ ఇస్తామ‌ని ఈ సంద‌ర్భంగా తెలియ‌జేస్తున్నాం. అలాగే నిర్మాత‌గా నా నుంచి కూడా వారి పిల్ల‌ల‌కు అండ‌గా నిల‌బ‌డాల‌ని కోరుకుంటున్నాను. సినిమా విష‌యానికి వ‌స్తే.. అభిలాష్ రెడ్డి తెచ్చిన స్క్రిప్ట్ బాగా న‌చ్చింది. మంచి టీమ్‌తో సినిమాను స్టార్ట్ చేశాం. క‌రోనా టైమ్‌లో అంద‌రూ ఉన్న టైమింగ్ ప్ర‌కారం సినిమా చేస్తూ వ‌చ్చారు. అంజిగారు.. ఇచ్చిన స‌పోర్ట్‌తో మూడు సినిమాల‌ను పూర్తి చేయ‌గ‌లిగాం. ఆయ‌నంతా ధైర్యాన్నిచ్చారు. ఆయ‌న్ని డైరెక్ట్ చేసే అవ‌కాశం నాకు ద‌క్క‌డం ఆనందంగా ఉంది. బొబ్బిలి సురేశ్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. ఇంత మంచి టీమ్ దొర‌క‌డం నా అదృష్టం. శ్రీనివాస్ రెడ్డిగారు ఇచ్చిన స‌పోర్ట్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. వ‌ర్క్‌లో చాలా క్రియేటివ్‌గా ఉంటారు. అలాగే దీక్షిత్ శెట్టితో రోజ్ విల్లా సినిమా చేశాం. ఇప్పుడు రెండో సినిమా. స‌పోర్ట్ చేసిన అందరికీ థాంక్స్‌’’ అన్నారు.
డైరెక్ట‌ర్ అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ ‘‘నాకు డైరెక్ట‌ర్‌గా అవ‌కాశం ఇచ్చిన రామారావుగారికి, సినిమాలో యాక్ట్ చేసిన శ్రీనివాస‌రెడ్డి, దీక్షిత్ శెట్టి, సినిమాటోగ్రాఫ‌ర్ అంజిగారికి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ సురేశ్ బొబ్బిలిగారు స‌హా స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌. ఆగ‌స్ట్ 6న విడుద‌ల‌వుతున్న మా సినిమాను థియేట‌ర్స్‌లో చూసి ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.
యాక్టర్ శ్రీనివాస‌రెడ్డి – “మాట్లాడుతూ ‘‘మా సినిమాకు నిర్మాత రామావుగారు, సినిమాటోగ్రాఫ‌ర్ అంజిగారు, డైరెక్ట‌ర్ అభిలాష్‌గారే ‘ముగ్గురు మొనగాళ్లు’ . ఇలాంటి పాత్ర‌ను చేయ‌డం నాకు ఛాలెంజిగింగ్‌గా అనిపించింది. నాకు అంత మంచి క్యారెక్ట‌ర్ రాసిన క‌ళ్యాణ్‌గారికి, డైరెక్ట‌ర్‌గారికి థాంక్స్‌. క‌రోనా టైమ్‌లో షూటింగ్స్ లేవ‌ని అంద‌రూ బాధ‌ప‌డుతుంటే మా నిర్మాత‌గారు జాగ్ర‌త్త‌గా సినిమాను చిత్రీక‌రించి మా అంద‌రికీ డ‌బ్బులిచ్చారు. టి.ఎన్‌.ఆర్‌గారికి మిస్ కావ‌డం చాలా బాధ‌గా ఉంది. ఈ సినిమాకు హీరో దీక్షిత్ శెట్టి. క‌న్న‌డ సినిమాలో దియాలో న‌టించి మెప్పించిన దీక్షిత్‌.. చాలా మంచి ఆర్టిస్ట్‌. తెలుగులో ఇంకా మంచి సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను. ఔట్ ఔట్ అండ్ ఎంట‌ర్‌టైన‌ర్‌. డైరెక్ట‌ర్ అభిలాష్‌, అంజిగారు, సురేష్ బొబ్బిలిగారు… ఇలా అంద‌రితో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా ఉంది. ఆగ‌స్ట్ 6న విడుద‌ల‌వుతున్న సినిమాను థియేట‌ర్‌లో అంద‌రూ ఎంజాయ్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.
హీరో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ ‘‘ – నేను చిన్న‌ప్ప‌టి నుంచి క‌న్న‌డ సినిమాల‌తో పాటు తెలుగు సినిమాలు చూస్తూ పెరిగాను. తెలుగులో చిరంజీవిగారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. తెలుగులో యాక్ట్ చేస్తాన‌ని ఎప్పుడూ అనుకోలేదు. కానీ రెండు సినిమాలు చేశాను. అందుకు ప్రేక్ష‌కులు చూపిన ఆద‌ర‌ణే కార‌ణం. ఈ సినిమా విషయానికి వస్తే డైరెక్ట‌ర్ అభిలాష్‌గారు క‌థ చెప్ప‌గానే బాగా న‌చ్చింది. ఛాలెంజింగ్ రోల్ కావ‌డంతో ఓకే చెప్పాను. కొత్త ఎక్స్‌పీరియెన్స్‌. రామారావుగారు.. మేం చేస్తున్న క్యారెక్ట‌ర్స్ కోసం ఇన్‌స్ట్ర‌క్ట‌ర్స్‌ను పెట్టి స‌పోర్ట్ చేశారు. టి.ఎన్‌.ఆర్‌గారిని మిస్ అవుతున్నందుకు బాధ‌గా ఉంది. శ్రీనివాస రెడ్డిగారికి థాంక్స్‌. నాజ‌ర్‌గారు, రాజా ర‌వీంద్ర‌గారు ఇలా అంద‌రికీ థాంక్స్‌. అంజిగారితో నేను చేసిన రెండో సినిమా. సురేశ్ బొబ్బిలిగారు సూప‌ర్బ్ మ్యూజిక్ ఇచ్చారు. డిఫ‌రెంట్ మూవీ. కంప్లీట్ ఎంట‌ర్‌టైన‌ర్‌.. సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్ కూడా. ఆగ‌స్ట్ 6న మీ ముందుకు వ‌స్తున్నాం. ఆశీర్వ‌దించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

Related posts

Leave a Comment