గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ సౌజన్యంతో టెలివిజన్ ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులకు నిత్యావసర సరుకులు పంపిణీ

Spread the love

నలక్ష్మి ట్రస్ట్ డైరెక్టర్ గుడ్ల శ్రీధర్ మరియు ట్రస్ట్ చైర్మన్ గుడ్ల ధనలక్ష్మి టెలివిజన్ ఫిల్మ్ ఫెడరేషన్ లోని అన్ని డిపార్ట్మెంట్స్ లలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న సుమారు 1500 మంది కి పైగా సభ్యులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాజీ యఫ్.డి.సి.ఛైర్మెన్, టెలివిజన్ పరిశ్రమ అధ్యక్షుడు రామ్మోహన్ రావు, జీవిత రాజశేఖర్, యమ్.యల్.ఏ అరికె పూడి గాంధీ,యమ్. యల్.ఏ మాగంటి గోపీనాథ్, కార్పొరేటర్ మంజుల రఘునాదరెడ్డి, డాక్టర్ సముద్రాల వేణుగోపాల్ చారి. వి.వి.కె హోసింగ్ ఛైర్మెన్ విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.అనంతరం టెలివిజన్ ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది

ఈ సందర్భంగా డాక్టర్ సముద్రాల వేణుగోపాల్ చారి. మాజీ యఫ్.డి.సి.ఛైర్మెన్, టెలివిజన్ పరిశ్రమ అధ్యక్షుడు రామ్మోహన్ రావు,వి.వి.కె హోసింగ్ ఛైర్మెన్ విజయ్ కుమార్ లు మాట్లాడుతూ… ప్రస్తుతం తెలుగు టెలివిజన్ పరిశ్రమలో ఉన్న అనేక మంది టివి పరిశ్రమ కార్మికులు కరోనా వలన ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇబ్బందులు పడుతున్న వారిని ధనలక్ష్మి ట్రస్ట్ గుర్తించి టి.వి పరిశ్రమతో సంబంధం లేకపోయినా టివి కార్మికులు ఇబ్బంది పడుతున్నారని తెలియడంతో మేం ఉన్నామంటూ ముందుకు వచ్చి .. 1500 మంది కార్మికులకు పైగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి ముందుకు వచ్చినందుకు వారికి నా ధన్యవాదాలు. కరోనా సమయంలో ఇప్పటి వరకు 35, వేల కుటుంబాలకు ఈ ట్రస్ట్ ద్వారా సహాయం చేసారు అది ఎంతో గొప్ప విషయం. ఇలాగే వీరు చేసే సహాయ, సహకారాలకు మా సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తున్నామని అని అన్నారు

జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ… కరోనా టైం లో సినిమా,టీవీ రంగాల్లో ఉన్న చాలామంది ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ సమయంలో ఎవరికి ఎం అవసరం వచ్చినా ప్రతి ఒక్కరు అవసరం ఉన్న వారికి సహాయం చెయ్యాలి. కష్ట కాలంలో మనకు ఎవరు దాతృత్వం ఇచ్చిన కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. ఇలాంటి టైంలో ధనలక్ష్మి ట్రస్ట్ వారు ముందుకు వచ్చి సహాయం చేస్తున్నందుకు వారికి మా కృతజ్ఞతలు అని అన్నారు.

ధనలక్ష్మి ట్రస్ట్ చైర్మన్ గుడ్ల ధనలక్ష్మి మాట్లాడుతూ.. కరోనా సమయంలో మా ట్రస్టు ద్వారా సుమారు 35,000 కుటుంబాలకు సహాయ సహకారాలు అందించడమే గాక, కరోనా వచ్చిన వారికి 14 రోజులు మెడిసిన్స్ తో పాటు వారికి కావలసిన అవసరాలు తీర్చడం జరిగింది. వేణుగోపాల్ గారు మమ్మల్ని కలసి టివి పరిశ్రమలోని కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పిన వెంటనే మేము 1500 మందికి పైగా నిత్యావసర సరుకులు అందించదానికి ముందుకు వచ్చాము.మా ట్రస్ట్ కు ఎవరొచ్చి అడిగినా కాదనకుండా మేము సహాయం చేస్తాము.

ధనలక్ష్మి ట్రస్ట్ డైరెక్టర్ గుడ్ల శ్రీధర్ మాట్లాడుతూ.. కరోనా కాలంలో ధనలక్ష్మి ట్రస్ట్ చేసిన సేవలు అమోఘం. ఇప్పటివరకు మేము తెలంగాణ లోని 11 జిల్లాలలో 35,000 మందికి సహాయం చేయడం జరిగింది.ఇప్పుడు చేస్తున్న 1500 మందితో కలిపి 36000 పై చిలుకు కుటుంబాలకు సహాయం చెయ్యడం జరిగింది. కరోనా వచ్చిన వారికి 14 రోజులు పాటు మెడిసిన్స్ , ఫుడ్ సప్లై కూడా చెయ్యడం జరిగింది.ధనలక్ష్మి గారికి ఏ పదవి లేకున్నా ఎవరికి ఎం ఇబ్బంది వచ్చి మా ట్రస్ట్ కు వచ్చినా.. వారి అవసరం గుర్తించి ధనలక్ష్మి ట్రస్ట్ సహాయం చేస్తుంది. అలాంటి ట్రస్ట్ ద్వారా ఎంతోమంది అవసరాలు తీరుస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని అన్నారు.

సురేష్ మాట్లాడుతూ …టెలివిజన్ పరిశ్రమ ఈ రోజు సినిమా పరిశ్రమ తో సమానంగా నడుస్తుంది. అయినా టివి.పరిశ్రమలో పని చేసే కార్మికులకు హెల్త్ కార్డ్స్ లేవు ,కల్యాణ లక్ష్మీ లేదు, ఇళ్ళు లేవు అలాగే మమ్మల్ని అడిగే వారు లేరు .కరోనా కష్ట కాలంలో టెలివిజన్ పరిశ్రమలో పని చేసే చాలామంది నటీనటులను , సాంకేతిక నిపుణులను, దర్శకులను కోల్పోవడం జరిగింది. వారి కుటుంబాలకు ఎవరూ దిక్కు లేదు.ఎవరూ లేని వారికి దేవుడే దిక్కు అన్నట్లు అలాంటి దేవుని రూపంలో ధనలక్ష్మి ట్రస్ట్ వారు వచ్చి 1500 మందికి నిత్యావసర సరుకులు సహాయం చేయడం చాలా సంతోషంగా ఉంది.అన్నారు.

Related posts

Leave a Comment