ప్రపంచంలో శిల్పకళా వారసత్వంలో విజయనగర సామ్రాజ్యంకు సముచితమైన స్తానం ఉన్నదని, శ్రీకృష్ణదేవరాయల కాలం స్వర్ణ యుగమని , అలాంటి రాయలవారి ప్రేమకథను ‘నాగలాదేవి ‘ పేరుతో గ్రంథస్థము చెయ్యడం సంతోషంగా ఉందని విజయనగర శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం కులపతి ప్రొ. ఎం మునిరాజు పేర్కొవున్నారు .
శ్రీగంగ రూరల్ డెవలప్మెంట్ సొసైటి సంస్థ హంపిలోని విరూపాక్ష దేవాలయంలో ‘నాగలాదేవి ‘ కన్నడ నవల ఆవిష్కరణ సభను ఏర్పాటు చేసింది . భగీరథ తెలుగులో రచించిన ‘నాగలాదేవి ‘ నవలను కన్నడంలోకి డాక్టర్ దేవన్న అనువదించారు
ఈ పుస్తకాన్ని మునిరాజు ఆవిష్కరించారు . ఈ సందర్భగా భగీరథ , దేవన్నను ఆయన అభినందించారు .
ప్రొ. బి.సి. ఐగోల్ ‘నాగలాదేవి’ గురుంచి మాట్లాడుతూ – చరిత్రలోని ఒక సరికొత్త కోణాన్ని ఇందులో భగీరథ గారు ఆవిష్కరించారు . ఇది గొప్ప పరిశోధనా గ్రంథమని , కన్నడంలోకి నాగన్న సమర్ధవంతంగా అనువదించారని చెప్పారు.
భగీరథ మాట్లాడుతూ – కృష్ణదేవరాయలు , నాగలాదేవి నడయాడిన విరుపాక్త దేవాలయంలో ఈ కార్యక్రమం జరగాలని నేను అనుకున్నాను, దానిని దేవన్న నెరవేర్చారు . కన్నడంలో కూడా ఈ నవల పండిత పామరుల అభిమానం సంపాదిస్తుందన్న నమ్మకం ఉందని చెప్పారు . నాగలాదేవి నవల వ్రాయడం కోసం 15 సంవత్సరాలు పరిశోధన చేశానని , శాసనాల సాక్షిగా దీనిని వ్రాయడం జరిగిందని పేరొకొన్నారు .
కన్నడ అనువాదకుడు డాక్టర్ దేవన్న మాట్లాడుతూ – ఈ నవలను కన్నడంలోకి అనువదించాడని భగీరథ గారు అనుమతించడం అరుస్తామని , నగలదేవిని కన్నడ పాఠకులు అభిమానించి ఆదరిస్తారననే నమ్మకం ఉందని చెప్పారు .
ఆర్టిస్ట్ డాకోజు శివ ప్రసాద్ అహో ఆంధ్ర భోజ శ్రీకృష్ణదేవరాయ అనే గీతాన్ని ఈ సందర్భగా పాడి వినిపించారు . సభకు కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ రుద్రప్ప అధ్యక్షత వహించారు . ఇంకా సభలో కన్నడ విశ్వవిద్యాలయం ప్రొ. ఎస్. వై. సోమశేఖర్, శ్రీమతి అన్నపూర్ణ సింగ్, పారిశ్రామికవేత్త భీమనేని భాస్కరనాయుడు, హెచ్. శ్రీనివాసరెడ్డి , పాటి సుబ్బారావు , బెల్లా తెలుగు సాంస్కృతిక సంఘం కార్యదర్శి గోపాలకృష్ణ పాల్గొన్నారు .
అతిధులను అధ్యక్షులు శ్రీమతి శకుంతల సత్కరించగా ,కార్యదర్శి .డా. ఆర్. వాత్సల్య వందన సమర్పణ చేశారు .


