* 18 సంవత్సరాలుగా అందరినీ అలరిస్తున్న విహారి ‘ద ట్రావెలర్’
* నవంబర్లో ఓటిటి యాప్ లాంచ్
2004 లో మా టీవీ లో మొదలైన విహారి ద ట్రావెలర్ ఎన్నో మైళ్ళరాలని అధిగమించి ఇప్పుడు ఓటిటి లో తనదైన శైలిలో అలరించడానికి సిద్ధంగా ఉంది. ఏ ఎల్ నితిన్ వ్యవస్థాపకుడిగా దర్శకుడిగా ఈ యాప్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ట్రావెల్ గైడ్, డివిడి’స్, ఫుడ్ రిలేటెడ్ గా ఎన్నో వీడియోస్ చేసి అలరించింది విహారి. కరుణ, స్నిగ్ధ లాంటి ప్రముఖ యాంకర్స్ తో కలర్ ఫుల్ ఇన్ఫర్మేటివ్ ఎపిసోడ్స్ ఎన్నో అందించింది విహారి. ఇక ఈ నవంబర్ నుండి సుమ లాంటి లెజండ్రీ యాంకర్ తో ఇన్నోవేటివ్ ఎపిసోడ్స్ కూడా స్టార్ట్ టెలికాస్ట్ చేయబోతుంది విహారి. ఇప్పుడు ఓటిటి హోస్ట్ గా శ్రీ సత్య ని తీసుకున్నారు. అదేవిధంగా ఈ ఓటిటి యాప్ కి కొలాబరేట్ అయిన సదరన్ ట్రావెల్స్ ప్రవీణ్ గారు వజ్ర కన్స్ట్రక్షన్స్ రాజుగారు, శ్వేత గారు మరియు యాంకర్ శ్రీ సత్య గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అదేవిధంగా ఈ విహారి ఓటిటి కి టిటిఎఫ్ మరియు వేగ జ్యువెలర్స్ కూడా కోలాబరేట్ అవ్వడం విశేషం. ప్రస్తుతం ఓటిటి కి సంబంధించిన ప్రోమో లాంచ్ జరగగా నవంబర్ లో ఓటిటి లాంచ్ అవుతుంది.
ఈ సందర్భంగా సదరన్ ట్రావెల్స్ ప్రవీణ్ గారు మాట్లాడుతూ…
“2004 నుంచి నితిన్ గారితో పరిచయం ఉంది. విహారి కాన్సెప్ట్ చెప్పినప్పుడే నాకు చాలా నచ్చింది. ఆయన ఎంచుకున్న ఆ దారి ఇప్పుడు ఆయన కంటే ఎత్తుగా సక్సెస్ లో ఎదిగింది. మన దేశంలో తెలుగువాళ్లే కాకుండా బయట దేశంలో తెలుగు వాళ్ళు కూడా విహారిని సక్సెస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది అని చాలామంది చెప్పారు. ఇప్పుడు ఈ ఓటిటి కూడా మంచి సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను” అన్నారు.
వజ్ర కన్స్ట్రక్షన్స్ రాజుగారు మాట్లాడుతూ… *
” విహారి గురించి ఎన్నో విషయాలు తెలుసుకుని అసోసియేట్ అవ్వడానికి సిద్ధమయ్యాను. నితిన్ చాలా యాంబిషియస్ & మంచి వ్యక్తి. నితిన్ తో విహారితో కోలాబరేటడం చాలా ఆనందంగా ఉంది” అన్నారు.
వజ్ర కన్స్ట్రక్షన్స్ శ్వేతా గారు మాట్లాడుతూ…
” నేను చిన్నగా ఉన్నప్పుడే ట్రావెల్ స్టార్ట్ చేయకముందే విహారి ట్రావెల్ ఎపిసోడ్స్ చూసి ట్రావెల్ చేయాలి అనుకునేదాన్ని. ఇప్పుడు అదే విహారి నితిన్ గారితో ఓటిటి ఆప్ తో కలాబరేట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది” అన్నారు.
విహారి అధినేత ఏ ఎల్ నితిన్ గారు మాట్లాడుతూ…
” 2004లో విహారి మా టీవీ లో స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు సపోర్ట్ చేసిన కరుణ, పి జి వింద, స్నిగ్ధకి చాలా థాంక్స్. ఇప్పుడు ఓటిటి కి ఫేస్ ఆఫ్ ఎవరు అని ఆలోచిస్తే గుర్తుకొచ్చింది శ్రీ సత్య. తను చాలా డెడికేటెడ్ అండ్ కమిటెడ్. అదేవిధంగా నాకు ముందు నుంచి సపోర్ట్ చేస్తున్న టిటిఎఫ్ మహేష్ గారికి సదరన్ ట్రావెల్స్ ప్రవీణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మాతో కోలాబరేట్ అయిన వజ్ర కన్స్ట్రక్షన్స్ రాజుగారికి, శ్వేత గారికి వేగ జ్యువెలర్స్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను” అన్నారు.
యాంకర్ శ్రీ సత్య మాట్లాడుతూ…
” ప్రతి విషయంలో నన్ను సపోర్ట్ చేస్తున్న మీడియాకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటిదాకా హోస్ట్ గా నేను దేనికి చేయలేదు. ఫస్ట్ టైం హోస్ట్ అనగానే భయమేసింది, కానీ నితిన్ గారు చాలా సపోర్ట్ చేశారు. ట్రావెల్ చేయడం అంటే మనకు మినిమం బడ్జెట్లో ఎక్కడ స్టే చేయొచ్చు ఎక్కడ ఫుడ్ బాగుంటుంది ఎక్కడ మనం తిరిగే ప్లేసెస్ ఉన్నాయి అని అన్ని విషయాలని తెలియజేస్తుంది విహారి. థాంక్స్ టు ఆల్ ద స్పాన్సర్. విహారి లో నేను ఒక భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. నన్ను సెలెక్ట్ చేసిన నితిన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను” అన్నారు.



