మాస్‌ మహారాజా రవితేజ ‘రామారావు ఆన్‌ డ్యూటీ’లో హీరోయిన్‌గా రాజీషా విజయన్‌

rajisha Vijayan In Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri’s Ramarao On Duty
rajisha Vijayan In Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri’s Ramarao On Duty
Spread the love

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. రవితేజ కెరీర్‌లో 68వ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, రవితేజ టీమ్‌ వర్క్స్‌ పతాకాలపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా శరత్‌ మండవ దర్శకునిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు విశేష స్పందన లభించింది. ఈ చిత్రంలో రవితేజ పవర్‌ఫుల్‌ ప్రభుత్వఅధికారిగా కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులకు ఉన్న ఆసక్తి మరింత పెరిగడంతో పాటుగా అంచనాలు కూడా పెరిగాయి. ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ చిత్రంలో ఒక్క రామారావుగా ఒక్క రవితేజ క్యారెక్టరే కాదు ఈ సినిమాలోని ప్రతిపాత్రకు ప్రాముఖ్యం ఉంది.
కథానుగుణంగా ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉంది. ‘మజలీ’ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న దివ్యాంశ కౌశిక్‌ ఇప్పటికే ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. ఈ సినిమాలోని మరో ప్రధానమైన హీరోయిన్‌ పాత్రకు మలయాళ నటి రాజీషా విజయన్‌ను చిత్రబృందం ఎంపిక చేసుకుంది. రాజీషకు తెలుగులో రవితేజ ‘రామారావు ఆన్‌ డ్యూటీ’తొలి చిత్రం కావడం విశేషం.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతుంది. కొన్ని రోజులుగా రవితేజ, దివ్యాంశ , రాజీషలపై సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరణ జరుగుతుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ డిఫరెంట్‌ థ్రిల్లర్‌కు ప్రముఖ నటీనటులు, అత్యున్నత సాంకేతిక నిపుణులు అసోసియేటై ఉన్నారు.
శ్యామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సత్యన్‌ సూర్యన్‌ ఐఎస్‌సీ ఛాయాగ్రాహకులు. ప్రవీణ్‌ కేఎల్‌ ఈ చిత్రానికి ఎడిటర్‌.
నటీనటులు: రవితేజ, రాజీష విజయన్, దివ్యాంశా కౌశిక్, నాసిర్, సీనియర్‌ నరేష్, పవిత్ర లోకేష్, రాహుల్‌ రామకృష్ణ, ‘ఈ రోజుల్లో’ ఫేమ్‌ శ్రీ, మధుసూధన్‌ రావు, సురేఖ వాణి తదితరులు.
సాంకేతిక విభాగం:
స్టోరీ, స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్‌: శరత్‌ మండవ
ప్రొడ్యూసర్‌: సుధాకర్‌ చెరుకూరి
బ్యానర్‌: ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, ఆర్‌టీ టీమ్‌వర్క్స్‌
మ్యూజిక్‌ డైరెక్టర్‌: సామ్‌ సీఎస్‌
డీఓపీ: సత్యన్‌ సూర్యన్‌ ఐఎస్‌సీ
ఎడిటర్‌: ప్రవీణ్‌ కేఎల్‌
ఆర్ట్‌ డైరెక్టర్‌: సాహి సురేష్‌
పీఆర్‌వో: వంశీ – శేఖర్‌