నవంబర్ 6న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “హతః” సినిమా
పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ తో కలిసి హీరో కిరణ్ అబ్బవరం తన కేఏ ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్న సినిమా “హతః”. ఈ చిత్రాన్ని కిరణ్ అబ్బవరం సమర్పణలో శివశంకర నాయుడు. వై నిర్మిస్తున్నారు. అనుష్ గోరక్ దర్శకత్వం వహిస్తున్నారు. “హతః” సినిమాలో కుష్లు, రెహమాన్, నమ్రిత ఎంవీ, తనూజ పుట్టుస్వామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవంబర్ 6న “హతః” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ చిత్ర టీజర్ ను హైదరాబాద్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో…
ఎడిటర్ అఖిల్ చక్రవర్తి మాట్లాడుతూ – మా మూవీ టీజర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాను. “హతః” సినిమా థియేటర్స్ లో మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తుంది. ఈ చిత్రంతో నేను ఎడిటర్ గా పరిచయం కావడం సంతోషంగా ఉంది. మా మూవీని ప్రెజెంట్ చేస్తున్న కిరణ్ గారికి థ్యాంక్స్. అన్నారు.
అసోసియేట్ ప్రొడ్యూసర్ రితికేష్ గోరక్ మాట్లాడుతూ – “హతః” సినిమా కంటెంట్ పట్ల గర్వపడుతున్నాం. రెగ్యులర్ గా మనం చూసే సినిమాలకు భిన్నమైన ఒక ప్రయత్నం ఈ చిత్రంతో చేశాం. టీజర్ మీకు బాగా నచ్చిందని నమ్ముతున్నాం. “హతః” థియేటర్స్ లో మీకొక కొత్త ఎక్సిపీరియన్స్ ఇస్తుంది. నవంబర్ 6న థియేటర్స్ లో మీట్ అవుదాం. అన్నారు.
ప్రొడ్యూసర్ శివశంకర నాయుడు.వై. మాట్లాడుతూ – ఈ సినిమా వెనక పెద్ద జర్నీ ఉంది. మా మూవీకి అండగా నిలబడిన కిరణ్ గారికి థ్యాంక్స్. చాలా సినిమాలకు నేపథ్యంగా ప్రాంతం, సంప్రదాయం, పురణాల నుంచే రిఫరెన్స్ పాయింట్స్ ఉంటాయి. కానీ ఎలాంటి బౌండరీస్ లేకుండా చాలా తక్కువ సినిమాలు వస్తాయి. అలాంటి అరుదైన సినిమా “హతః”. ఏ ప్రాంతం వాళ్లు ఈ సినిమా చూసినా అది తమ దగ్గరే జరిగింది అనుకునేలా ఉంటుంది. మా మూవీలో కూడా వివిధ ప్రాంతాల నటీనటులు ఉన్నారు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది. మా డైరెక్టర్ అనూష్ అనుకున్నట్లు మూవీ చేసేందుకు మా టెక్నీషియన్స్ అంతా ఒక వారధిలా నిలబడ్డారు. విజువల్స్, బీజీఎం..ఇలా థియేటర్స్ లోనే ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది. అన్నారు.
స్క్రిప్ట్ రైటర్, డీవోపీ, డైరెక్టర్ అనుష్ గోరక్ మాట్లాడుతూ – “హతః” మూవీ టీజర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాను. మా ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. నేను మాట్లాడటం కంటే మా సినిమా టీజర్ మాట్లాడాలి అనుకుంటున్నా. మిస్టికల్ థ్రిల్లర్ సినిమా ఇది. కొంత హారర్ ఉంటుంది. అన్ని జానర్స్ కలిసి ఉంటాయి. ఈ మూవీ కథలో చాలా సీక్రెట్స్ ఉన్నాయి. అవి థియేటర్స్ లోనే ఎక్సిపీరియన్స్ చేయాలి. మిగతా విషయాలన్నీ తర్వాత ఈవెంట్స్ లో చెబుతాను. అన్నారు.
నటి తనూజ పుట్టుస్వామి మాట్లాడుతూ – మనం మూవీస్ కు కథ ఇలా ఉంది అలా ఉంది అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఈ సినిమా కథను చెప్పడం కంటే స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటుంది. ఈ సినిమాలో నటించే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. నేను బిగ్ బాస్ కు వెళ్లకముందే చేసిన చిత్రమిది. ఈ సినిమా కంటెంట్ మీద చాలా నమ్మకంతో ఉన్నాను. బిగ్ బాస్ తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో కూడా ఇదే విషయం చెప్పాను. ఈ టీమ్ తో మూడేళ్లు జర్నీ చేశాను. ఈ సినిమా డైరెక్టర్ అనూష్ గారి డ్రీమ్. ఆయన కథ చెప్పినప్పటి కంటే స్కెచ్ లతో డీటెయిల్డ్ గా చెప్పినప్పుడు కథలో ఇంత డెప్త్ ఉందా అనిపించింది. వీళ్లకు ఈ ప్రాజెక్ట్ మీద ఉన్న నమ్మకమే నాలోనూ కాన్ఫిడెన్స్ పెంచింది. నవంబర్ 6న “హతః”తో థియేటర్స్ లో కలుద్దాం. అన్నారు.
కో ప్రొడ్యూసర్, యాక్టర్ కుష్లు మాట్లాడుతూ – మా టీమ్ అంతా కలిసి ఒక మంచి సినిమా చేశాం. మీకు తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాం. ఈ అవకాశం కల్పించిన అనూష్ కు థ్యాంక్స్. విజువల్స్ అదిరిపోయాయి. హాలీవుడ్ మూవీలా ఉందంటున్నారు. టాలీవుడ్ కు అనూష్ లాంటి దర్శకులు కావాలి. అన్నారు.
ప్రొడ్యూసర్ కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – ఈ సినిమా మాకు ఒక స్పెషల్ ఫిలిం అవుతుందని నమ్ముతున్నాను. మా సినిమా రిలీజ్ కు ఇంకా 50 రోజుల టైమ్ ఉంది. థియేటర్స్ లో మీరు ప్రతి సీన్ కు నెక్ట్స్ ఏం జరుగుతుంది అనే సర్ ప్రైజ్ కు లోనవుతారు. సినిమా ఆద్యంతం కొత్త ఫీల్ కలిగిస్తుంది. క్లైమాక్స్ వరకు సినిమా మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఈ సినిమా చూశాకే చెబుతున్నా. మూవీ పూర్తయ్యాక నాకు సినిమాలోని లింక్ పాయింట్స్ రీకాల్ చేసుకోవడానికి పదినిమిషాలు పట్టింది. డైరెక్టర్ ను పిలిచి అన్నీ అడిగి తెలుసుకున్నాను. రాబోయే దీపావళికి మీకు మా మూవీ బెస్ట్ ఎక్సిపీరియన్స్ ఇస్తుంది. ఎడిటింగ్, మ్యూజిక్, విజువల్స్..ఇలా టెక్నికల్ గానే కాదు నటీనటుల పర్ ఫార్మెన్స్ పరంగా అన్నీ మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తాయి. శివన్నే ముందు నుంచీ ఈ సినిమాను చేస్తూ వచ్చాడు. నేను మధ్యలో ప్రొడ్యూసర్ గా జాయిన్ అయ్యాను. ప్రాంతీయ బేధాలు లేకుండా ప్రేక్షకులంతా ఎంజాయ్ చేసే చిత్రమిది. అందుకే అన్ని భాషల్లో తీసుకొస్తున్నాం. క్రిటిక్స్ కూడా కొత్త టీమ్ మంచి సినిమా చేశారనే చెబుతారు. డైరెక్టర్ అనూష్ మంచి వర్క్ చేశాడు. అతనికి ఇండస్ట్రీలో కావాల్సినంత గుర్తింపు దక్కుతుంది. రెహమాన్, కుష్లు, తనూజ..ఇలా అందరూ బాగా నటించారు. ఒక కొత్త తరహా సినిమాను ఈ దీపావళికి మీకు అందించబోతున్నాం. థియేటర్స్ లోనే ఎక్సిపీరియన్స్ చేయాల్సిన చిత్రమిది. నవంబర్ 6న థియేటర్స్ లో మీట్ అవుదాం. అన్నారు.
నటీనటులు – రెహమాన్, కుష్లు, తనూజ పుట్టుస్వామి, నమ్రిత.ఎంవీ, తదితరులు
టెక్నీషియన్స్:
పబ్లిసిటీ డిజైన్ – అనంత్ కంచెర్ల
కాస్ట్యూమ్ డిజైనర్ – మేఘన గుమ్మడి
ఆర్ట్ డైరెక్టర్ – మక్కెన విజయ్ కుమార్, జీమోన్
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ – జునైద్ ఉల్లా, హైకా స్టూడియోస్
అసోసియేట్ ప్రొడ్యూసర్ – రితికేష్ గోరక్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – అల్లు బాలకృష్ణ
లైన్ ప్రొడ్యూసర్ – వెంకట్ రాహుల్
ఎడిటర్ – అఖిల్ చక్రవర్తి
మ్యూజిక్ – జేసిన్ జార్జ్
కో ప్రొడ్యూసర్స్ – వినీల సాహిత్య, కుష్లు
బ్యానర్స్ – కేఏ ప్రొడక్షన్స్, పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్
ప్రొడ్యూసర్స్ – కిరణ్ అబ్బవరం, శివశంకర నాయుడు. వై
స్క్రిప్ట్, డీవోపీ, డైరెక్టర్ – అనుష్ గోరక్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కే మీడియా)
“హతః” క్రేజీ ఫిలిం, ప్రతి సీన్ సర్ ప్రైజ్ చేస్తుంది, ఈ దీపావళికి ఒక కొత్త మూవీ అందించబోతున్నాం – టీజర్ లాంఛ్ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ కిరణ్ అబ్బవరం
