కాలి గాయంపై స్పందించిన హీరోయిన్ రశ్మికమందన్న

Actress Rashmika Mandanna responds to her leg injury
Actress Rashmika Mandanna responds to her leg injury
Spread the love

* గాయాలు చికాకు తెప్పిస్తాయని ఇన్ స్టా పోస్ట్

ఇటీవల మైసా సినిమాలో డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా తీవ్రంగా గాయపడింది హీరోయిన్ రశ్మిక మందన్న. ఆమె 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. వైద్యుల సూచన మేరకు రశ్మిక బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. ఆమె తాజాగా తన కాలి గాయంపై స్పందించారు. ఇన్ స్టా వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ లో రశ్మిక మందన్న స్పందిస్తూ  – గాయాలు అవ్వడం నాకు చాలా చిరాకు తెప్పిస్తుంది. ఈ గాయం గురించి ఎవరికి తెలియకూడదు అనుకున్నా కానీ తెలిసిపోయింది. నాకు ఇలాంటి గాయం కావడం ఇది మూడవసారి. తుంటికి కాలుని కలిపే టెండన్స్ ఒక్కో వైపు నాలుగు ఉంటాయి. నా కుడి తుంటిలోని ఒక టెండెన్ ఊడిపోయింది. నేను కాలు పైకి ఎత్తాలి అంటే అది మళ్లీ అతుక్కోవాలి. మైసా సినిమా కోసం డాన్స్ షూట్ చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. నేను చేస్తున్న సినిమాల్లో మైసా అత్యంత కష్టమైన సినిమా. నేను విశ్రాంతి తీసుకోవడానికే దేవుడు ఈ గాయం బారిన పడేలా చేశాడని భావిస్తున్నాను. అని అన్నారు. ప్రస్తుతం రశ్మిక రణబాలి, మైసా సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. వీటితో పాటు మరో రెండు భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే 30 ప్రాడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. రశ్మికకు అయిన తీవ్ర గాయంతో ఆయా సినిమాల, వ్యాపార ప్రకటనల షూటింగ్స్ నిలిచిపోయాయి.