టైమ్‌ లూప్‌లో రూపొందిన మొట్టమొదటి ఇండియన్‌ వెబ్‌ సిరీస్‌ ‘కుడిఎడమైతే’ ట్రైలర్‌ విడుదల.. జూలై 16న ‘ఆహా’లో రిలీజ్‌

aha releases the trailer of the sci-fi crime thriller Kudi Yedamaithe, featuring Amala Paul and Rahul Vijay
Spread the love

హండ్రెడ్‌ పర్సెంట్‌ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా… మోస్ట్ అవెయిటెడ్ సై ఫై క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కుడి ఎడ‌మైతేను జూలై 16న వీక్షకుల‌కు అందిస్తోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న డీ డే సమయం ప్రేక్షకుల ముందుకు రానుంది. యూ ట‌ర్న్‌, లూసియా వంటి స‌స్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల‌తో సూప‌ర్ డూప‌ర్ విజ‌యాల‌ను అందించిన డైరెక్టర్ ప‌వ‌న్‌కుమార్ ఈ వెబ్ సిరీస్‌ను తెర‌కెక్కించారు. అమ‌లాపాల్‌, రాహుల్ విజ‌య్‌, ప‌ద్మిని సేట్టం, రాజ్ మాదిరాజ్ కీల‌క పాత్రల్లో న‌టించారు. సస్పెన్స్‌, థ్రిల్లర్‌ సహా ఇతర ఎమోషన్స్‌తో పోలీస్‌ ఆఫీసర్‌ దుర్గ(అమలాపాల్‌), డెలివరీ బాయ్‌ ఆది(రాహుల్ విజయ్‌) మధ్య నడిచే ఈ రోలర్‌ కోస్టర్‌ ప్రేక్షకులను సీట్‌ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుందనడంలో సందేహం లేదు.
ట్రైలర్‌ను గమనిస్తే ఇండియాలోనూ మొదటిసారి టైమ్‌ లూప్‌ అనే పాయింట్‌ మీద ‘కుడి ఎడమైతే’ వెబ్‌ సిరీస్‌ రూపొందింది. ఇందులో దుర్గ, ఆది అనే ఇద్దరు వ్యక్తల జీవితంలో ఒకే రోజు, ఒకే సమయం(ఫిబ్రవరి29,2020) రిపీట్‌ అవుతుంటుంది. ఓ చిన్న పిల్లాడి కిడ్నాప్‌ కేసులో సాక్ష్యాలను సేకరించడానికి పోలీస్ ఆఫీసర్‌ దుర్గ ప్రయత్నాలు చేస్తుంటుంది. మరోవైపు నటుడిగా రాణించాలనుకున్న ఆది అనే యువకుడు డెలివరీ బాయ్‌గా వర్క్‌ చేస్తుంటాడు. వీరిద్దరూ ఓ రోడ్‌ యాక్సిడెంట్‌లో కలుసుకుంటారు. అయితే వీరిద్దరూ ఓ టైమ్‌ లూప్‌లోనే ఉండిపోతారు. దీని నుంచి బయట పడటానికి వీరిద్దరూ కలిసి పనిచేయాల్సి వస్తుంది. మరి వీరిద్దరూ వారి సమస్యకు పరిష్కారాన్ని కనుగొని రేపటిని చూస్తారా? అనేది తెలియాలంటే వెబ్‌ సిరీస్‌ చూడాల్సిందే. టైమ్‌ లూప్‌ అనే పాయింట్‌తో పాటు క్రైమ్‌ థ్రిల్లర్‌ డైమెన్షన్‌ను కూడా ఇందులో మనం గమనించవచ్చు.
బుధవారం ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ను ప్రముఖ డైరెక్టర్‌ నందినీ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా…
నందినీ రెడ్డి మాట్లాడుతూ “‘ఆహా’లో స్క్రిప్ట్స్‌ వింటున్న సమయంలో రామ్ విఘ్నేశ్‌గారి ‘కుడిఎడమైతే’ స్క్రిప్ట్‌ చాలా బాగా నచ్చింది. ఎంత బాగా నచ్చిందంటే.. చిన్న మార్పు కూడా చేయలనిపించలేదు. ఇది కచ్చితంగా ఆహాకు మంచి క్రేజ్‌ను తీసుకొచ్చే స్క్రిప్ట్‌ అవుతుంది కాబట్టి మంచి డైరెక్టర్‌, టీమ్‌ సెట్‌ చేసుకుని ముందుకు వెళ్లాలని అరవింద్‌గారికి, అజిత్‌గారికి చెప్పాను. ఆ సమయంలో పవన్‌కుమార్‌ ఈ సిరీస్‌ను చేయడానికి ముందుకు వచ్చాడు. సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్స్‌ చేయడంలో డైరెక్టర్‌ పవన్‌కుమార్‌ నెంబర్‌ వన్‌. తను స్క్రిప్ట్‌ వినగానే ఎగ్జయిట్‌ అయ్యి ఓకే చెప్పాడు. మంచి ఆర్టిస్టులు కావాలని అనుకున్నప్పుడు ఇందులో దుర్గ అనే లేడీ పోలీస్ ఆఫీసర్‌ పాత్రకు అమలాపాల్‌ పక్కాగా సరిపోతుందనిపించింది. తనైతే వందకు వెయ్యి శాతం ఎఫర్ట్ పెట్టి చేస్తుంది. ప్రతి సన్నివేశాన్ని పది మెట్లు పైకి తీసుకెళుతుంది. రాహుల్‌ విజయ్‌ చాలా టాలెంటెడ్‌ యాక్టర్‌. డెఫనెట్‌గా ప్రేక్షకులకు రోలర్‌ కోస్టర్‌ అవుతుంది. తెలుగు వెబ్‌ సిరీస్‌ల్లో ఆహాకు ఇది గేమ్‌ చేంజర్‌. తెలుగు వెబ్‌ సిరీస్‌కు ఓ స్టాండర్డ్‌ సెట్‌ చేయాలని పవన్‌ అండ్‌ టీమ్‌ చాలా కష్టపడ్డారు. తప్పకుండా అందరూ ఎంజాయ్‌ చేసేలా వెబ్‌ సిరీస్‌ ఉంటుంది” అన్నారు.
మ్యూజిక్‌ డైరెక్టర్‌ పూర్ణ చంద్ర మాట్లాడుతూ “ఈ వెబ్‌ సిరీస్‌కు మ్యూజిక్‌ అందించడానికి మూడు నాలుగు నెలలు కష్టపడ్డాం. ఎనిమిది ఎపిసోడ్స్‌ పూర్తి చేసిన తర్వాత.. ఓ ప్లేస్‌కు పదే పదే వెళ్లినప్పుడు ఓ పర్టికులర్‌ ఫీలింగ్‌ కలుగుతుంది. అలాంటి ఫీలింగ్‌ను మేం ఫీల్‌ అయ్యాం. రేపు సిరీస్‌ చూసే ప్రేక్షకులు కూడా అలాంగే ఫీల్‌ అవుతారు. డైరెక్టర్‌ పవన్‌కుమార్‌ నాపై నమ్మకంతో అవకాశం ఇచ్చినందుకు థాంక్స్‌. ఆయన డైనమిక్‌ ఆలోచనలకు తగ్గట్టు మ్యూజిక్‌ అందించాననే భావిస్తున్నాను” అన్నారు.
డైరెక్టర్‌ పవన్‌కుమార్‌ మాట్లాడుతూ “తొమ్మిది నెలలలుగా ఓ ఎగ్జయిట్మెంట్‌ ప్రాజెక్ట్‌లో భాగమయ్యానని చెప్పగలను. ఈ ప్రాజెక్ట్‌ కోసం నందినీ రెడ్డి కరెక్ట్‌ టీమ్‌ను సెట్‌ చేశారు. అందుకు నేను ఆమెకు థాంక్స్‌ చెప్పాలి. తర్వాత కార్తీక్‌ సహా ఆహా టీమ్‌కు స్పెషల్‌ థాంక్స్‌. మంచి స్క్రిప్ట్‌ను నా దగ్గరకు తీసుకొచ్చినందుకు వారికి థాంక్స్‌. నా టీమ్‌ అద్వైత, పూర్ణచంద్రతో సహా ఇక్కడకు వచ్చి వర్క్‌ చేసే అవకాశాన్ని కల్పించింది ఆహా. నా టీమ్‌ ఎంతగానో సపోర్ట్‌ చేసింది. కుడి ఎడమైతే ఎనిమిది ఎపిసోడ్స్‌ వెబ్‌ సిరీస్‌ .. నాలుగున్నర గంటల వ్యవధితో ఉంటుంది. అమలాపాల్‌, రాహుల్‌ విజయ్‌ సహా ఇతర నటీనటులు, టీమ్‌ ఇచ్చిన సపోర్ట్‌తో నలబై ఐదు రోజుల్లో పూర్తి చేశాం. అమలాపాల్‌, రాహుల్‌తో సూర్య, పద్మినిగారు సహా పదిహేను మంది క్యారెక్టర్స్‌ కీలకంగా కనిపిస్తాయి. రామ్‌ విఘ్నేశ్‌ ఇంత గొప్ప కంటెంట్‌ను ఎలా రాశాడో అర్థం కాలేదు. అందరికీ నచ్చుతుందని, భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్ట్స్‌ చేయాలని భావిస్తున్నాను” అన్నారు.
పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సహ నిర్మాత వివేక్‌ కూచిబొట్ల మాట్లాడుతూ “డైరెక్టర్‌ పవన్‌గారు అన్నట్లు పాండమిక్‌ సమయంలో ఈ సిరీస్‌ను చేశాం. షూటింగ్‌ సమయంలో కొందరు కొవిడ్‌ ప్రభావానికి గురయ్యారు. మా ఎడిటర్‌ అయితే హాస్పిటల్‌ నుంచి ఎడిట్‌ చేశారు. చాలా ఫైట్‌ చేసి అనుకున్న సమయంలో పూర్తి చేశాం. అమలాపాల్, రాహుల్‌ సహా టీమ్‌ ఎంతో హెల్ప్‌ అందించారు. నందినీగారు మంచి టీమ్‌ను సెట్‌ చేశారు. పవన్‌కుమార్‌గారు అద్భుతమైన డైరెక్టర్‌. ఆయన తెలుగులో కూడా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం. ఇక ఆహా టీమ్‌ గురించి చెప్పాలంటే అజిత్‌గారి గురించి ముందు చెప్పాలి. పని రాక్షసుడు.. చక్కగా కో ఆర్టినేట్‌ చేసుకుంటూ వచ్చారు. తెలుగులో చాలా మంచి వెబ్‌ సిరీస్‌ అని చెబుతున్నాను. విశ్వప్రసాద్‌గారికి స్పెషల్ థాంక్స్‌” అన్నారు.
రాహుల్‌ విజయ్‌ మాట్లాడుతూ “పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పవన్‌కుమార్‌ ఫిలింస్‌, ఆహా కాంబినేషన్‌లో రూపొందిన కుడి ఎడమైతేలో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. నందినీ రెడ్డిగారు లేకపోతే.. ఈ ప్రాజెక్ట్‌ ఇక్కడి వరకు వచ్చేది కాదు. అలాగే ఆహా ఓటీటీలో నాలాంటి అప్‌ కమింగ్‌ యాక్టర్‌కు అవకాశం వస్తే .. టాలెంట్‌ను చక్కగా చూపించుకునే అవకాశం ఉంటుందని ప్రూవ్‌ చేసింది. అజిత్‌గారికి, అరవింద్‌గారికి థాంక్స్‌. టైమ్‌ లూప్‌ మీద ఇలాంటి కంటెంట్‌ రావడం ఇదే ఫస్ట్‌ టైమ్‌. లూసియా, యూ టర్న్‌ సినిమాలతో పవన్‌కుమార్‌కు పెద్ద ఫ్యాన్‌గా మారాను. ఆయన దర్శకత్వంలో వర్క్‌చేయాలనుకున్నాను. నాలుగేళ్ల తర్వాత నా కల నిజమైంది. అమలాపాల్‌ నుంచి చాలా విషయాలను యాక్టర్‌గా నేర్చుకున్నాను. వ్యక్తిగా, నటుడిగా ఈ ప్రాజెక్ట్‌ వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను. తప్పకుండా జూలై 16న ఆహాలో విడుదలవుతున్న కుడిఎడమైతే వెబ్‌ సిరీస్‌ను చూడాలని కోరుకుంటున్నాను” అన్నారు.
అమలాపాల్‌ మాట్లాడుతూ “కుడిఎడమైతే’ వంటి గొప్ప ప్రాజెక్ట్‌లో భాగం కావడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఏం చేయాలనే ఆలోచనను మరింతగా పెంచిన ప్రాజెక్ట్‌ ఇది. బ్రిలియంట్‌ టీమ్‌తో వర్క్‌ చేశాను. ముందుగా చెప్పాలంటే నందినీ రెడ్డికి చెప్పాలి. తనే నాకు ఫోన్‌ చేసి నేను చేయబోయే దుర్గ అనే పాత్ర గురించి చెప్పింది. మంచి అవకాశాన్ని కల్పించిన నందనీ థాంక్స్‌. లూసియా, యూ టర్న్‌ సినిమాలు చూసినప్పుడు పవన్‌తో వర్క్‌చేయాలని అనుకున్నాను. ఇప్పుడు నా కల నిజమైంది. నటిగా నాలో మరో కోణాన్ని ఆవిష్కరించిన ప్రాజెక్ట్‌ ఇది. రాహుల్‌ విజయ్‌ సహా ఇతర యాక్టర్స్‌కి, టెక్నికల్‌ టీమ్‌కు థాంక్స్‌. దుర్గ, ఆది అనే పాత్రల్లో నేను, రాహుల్‌ చక్కగా క్యారీ చేశాం. రాహుల్‌ ఓ బ్రదర్‌లా కలిసిపోయాడు. అద్వైత, పూర్ణ చంద్రగారికి థాంక్స్‌. ఆహా ఈ ప్రాజెక్ట్‌ను పాండమిక్‌ టైమ్‌లో చేసినా కూడా ఎక్కడా టెన్షన్‌ లేకుండా చూసుకున్నారు. నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీకి థాంక్స్‌. జూలై 16న ఆహాలో విడుదల కాబోతున్న కుడి ఎడమైతే చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది” అన్నారు.
‘ఆహా’ సీఇఓ అజిత్‌ మాట్లాడుతూ “ప్రతి వారం ఆహాను ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులకు ముందుగా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. అరవింద్‌గారికి, రామ్‌గారికి ధన్యవాదాలు. ‘కుడిఎడమైతే’ గురించి చెప్పాలంటే .. మా అందరికీ చాలా స్పెషల్ ప్రాజెక్ట్‌. సాధారణంగా వెబ్‌ సిరీస్‌లో తొలి ఎపిసోడ్‌ను ఉచితంగా ప్రదర్శించేవాళ్లం కానీ కుడిఎడమైతే విషయంలో ప్యాట్రన్ మార్చాం. మూడు ఎపిసోడ్స్‌ను ఉచితంగా అందరూ చూడొచ్చు. మా టీమ్‌ త్వరగా అప్రూవల్‌ సంపాదించుకున్న స్క్రిప్ట్ ఏదైనా ఉందంటే కుడిఎడమైతే అనే చెప్పాలి. రామ్‌ విఘ్నేశ్‌ అద్భుతమైన స్క్రిప్ట్ ఇచ్చాడు. నందినీ ఒకసారి చూడగానే ఓకే చెప్పేసింది. నందినీ అలా చెప్పగానే అరవింద్‌గారు మరో ఆలోచన కూడా చేయకుండా ఓకే చెప్పేశారు. పవన్‌ కుమార్‌ డైరెక్ట్‌ చేసిన లూసియా, యూటర్న్‌ చిత్రాల్లో నాకు లూసియా చాలా ఇష్టం. తనను ఈ ప్రాజెక్ట్‌తో కలిసే అవకాశం కలిగింది. ఇండియాలోనే పవన్‌ అండ్ టీం టెక్నికల్‌గా చాలా గొప్ప టీమ్ అని చెప్పాలి. చెప్పిన టైమ్‌లో అనుకున్న అవుట్‌పుట్‌ను అందించారు. రాహుల్‌ విజయ్‌ ఇన్‌ క్రెడిబుల్‌ అప్‌కమింగ్‌ యాక్టర్‌. తను అంతలా కష్టపడ్డాడు. అమలాపాల్‌.. ఈ ప్రాజెక్ట్‌ ఒప్పుకున్నందుకు థాంక్స్‌. అద్భుతంగా చేసింది. ఇండియన్‌ ఆడియెన్స్‌కే కాదు.. ఇంటర్నేషనల్ ఆడియెన్స్‌కు కూడా ఇది గొప్ప కంటెంట్ అని చెప్పగలను. రేపు రాత్రి ఎనిమిది గంటలకు ఆహాలో కుడిఎడమైతే ప్రసారం కానుంది. ఈ ఏడాది ఆహా తమిళ్‌ను కూడా స్టార్ట్ చేయబోతున్నాం” అన్నారు.
అమలాపాల్‌, రాహుల్‌ విజయ్‌, రవిప్రకాశ్‌, పద్మిని సేట్టం, రాజ్‌ మాదిరాజ్‌, ఈశ్వర్‌ రచిరాజు, ప్రదీప్‌ రుద్ర, సూర్య శ్రీనివాస్‌ తదితరులు ఈ వెబ్‌ సిరీస్‌లో నటించారు.

Related posts

Leave a Comment