శ్రీనందు : ప్రతిభకు తగ్గ పాత్రలు!

Srinandu: Roles worthy of the talent!
Spread the love

టాలీవుడ్‌లో విలక్షణమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు, హీరో శ్రీ నందు. ప్రస్తుతం ఆయన నటించిన సరికొత్త చిత్రం ‘అగ్లీ స్టోరీ’ ఓటీటీలో రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇటీవల హాట్ స్టార్ లో విడుదలైన అగ్లీ స్టోరీ, దురంధర్, ది రాజా సాబ్ సినిమాల తర్వాత అత్యధిక ఆదరణ పొందిన చిత్రంగా రికార్డు సృష్టించింది. శ్రీ నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన అగ్లీ స్టోరీ ఏకంగా 8.1 మిలియన్ వ్యూస్ సాధించి టాప్‌లో నిలిచింది. తాజాగా హాట్ స్టార్ విడుదల చేసిన టాప్ 10 అత్యధిక వ్యూస్ చిత్రాల లిస్ట్ లో అగ్లీస్టోరీ 3వ స్థానంలో నిలిచింది. ఈ సందర్బంగా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు మూవీ యూనిట్ ధన్యవాదములు తెలిపింది.  కథాబలం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ, వైవిధ్యమైన నటనతో మెప్పిస్తున్న శ్రీ నందుకు ఈ సినిమా విజయం ఆయన కెరీర్‌కు మరింత బూస్ట్‌ని ఇస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమాలో శ్రీ నందు నటన చాలా అద్భుతం అని విశ్లేషకులు కొనియాడారు. చాలా సెటిల్ గా నటించడంతో పాటు, తన పాత్రలో ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమాతో శ్రీ నందు నటనా సమర్థ్యం ఎలాంటిదో స్పష్టంగా అర్ధం అవుతుంది. ఆయనకు సరైన పాత్ర పడితే వెండితెరపై చరిత్ర సృష్టించగలడు అని సినిమా విమర్శకులు సైతం ప్రశంశిస్తున్నారు. శ్రీ నందుకు ఉన్న మరో అడ్వాంటేజ్ అతని పొడువు. ఆ ఒడ్డుపొడుగు కు సరైన పాత్ర పడితే అందరిని మైమరిపించగలడు అనిపిస్తుంది. రొమాంటిక్ పాత్ర అయినా, మాస్ పాత్ర అయినా ఎలాంటి పాత్ర అయినా ఒదిగిపోయే నటనా కౌశల్యం ఆయన సొంతం అనిపిస్తుంది. ప్రేక్షకులను రంజింప చేయడానికి ఎలాంటి రోల్ అయినా చేసే నటులు చాలా అరుదు. అందులో శ్రీ నందు ఒకరు. కష్టపడే తత్వం కలవాడు కాబట్టే ఇన్ని సంత్సరాలు ప్రేక్షకులకు దగ్గరగా ఉన్నాడు. ఇప్పుడు అదృష్టం కలిసొచ్చి ప్రతిభకు తగ్గ పాత్రలు పడుతున్నాయి. అవి వెండితెరపై పండుతున్నాయి. సోషల్ మీడియాలో సైతం ఆయనకు విపరీతమైన ఆదరణ దక్కుతుంది. దీంతో శ్రీ నందు రాబోయే సినిమాలపై ప్రేక్షకులకు భారీ అంచనాలు కూడా పెరుగుతున్నాయి. మరి ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి ఎలాంటి సినిమాలతో రాబోతున్నారో ఆసక్తికరంగా మారింది

Related posts