‘లెనిన్’ ఫలితంతో భావోద్వేగానికి లోనైన భాగ్యశ్రీ!

Bhagyashree overcome with emotion over the result of 'Lenin'!
Spread the love

ఎన్నో ఆటు పోట్లు తర్వాత వచ్చే విజయం అది ఇచ్చే ఫీలింగ్ ఎలా ఉంటుందో దానిని అనుభవించిన వారికే తెలుస్తుంది. ఇప్పుడు అలాంటి ఫీల్ లోనే యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఉందని చెప్పవచ్చు. టాలీవుడ్ లో ఆమె కెరీర్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు వరకు చేసిన సినిమాలు కొన్నే కానీ ఆమెకి గుర్తింపు అయితే వచ్చింది కానీ.. గట్టి విజయం మాత్రం దక్కలేదు. అయితే దానిని ఇపుడు ‘లెనిన్’ రూపంలో దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు అందించారు. అఖిల్ తో చేసిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకోవడమే కాకుండా సాలిడ్ ఓపెనింగ్స్ కూడా రాబట్టింది. దీనితో మేకర్స్ ఏర్పాటు చేసిన బ్లాక్ బస్టర్ మీట్ లో భాగ్యశ్రీ చాలా భావోద్వేగానికి లోనైంది. దర్శకుడికి మొదటిగా థాంక్స్ చెబుతూ ఆమె హైదరాబాద్ ని తన కర్మభూమి అంటూ ఎంతో ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది. కన్నీరు పెడుతూ తన కెరీర్ లో ఆఖరి సినిమా కూడా ఇక్కడే ఉండాలని చెప్పడం ఒకింత ఆమెకి మన దగ్గర ఎంతటి అనుబంధం ఏర్పడిందో అర్ధం అవుతుంది. దీనితో ఈ యువ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్ గా మారాయి.

Related posts