ఆర్జీవికి ఆజన్మాంతం రుణపడి ఉంటా: నిర్మాత రామసత్యనారాయణ

rgvtho mudo cinema
Spread the love

ఆర్జీవితో ముచ్చటగా మూడో సినిమా

“తెలుగు సినిమా రంగం రాంగోపాల్ వర్మకి ముందు… రాంగోపాల్ వర్మ తర్వాత” అని అంటారనే విషయం తెలిసిందే. అయితే నావరకు… రాంగోపాల్ వర్మతో సినిమా తీయడానికి ముందు… తర్వాత అంటాను. ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాను” అంటున్నారు శతాధిక చిత్ర నిర్మాత
తుమ్మలపల్లి రామసత్యనారాయణ. “2014లో ఆర్జీవీతో నేను తీసిన ‘ఐస్ క్రీమ్’ చిత్రం.. నిర్మాతగా నా స్థాయిని పెంచడంతోపాటు… నా జాతకాన్ని కూడా మార్చింది. ఆ ఏడాది “ట్రాఫిక్” (సూర్య), “బచ్చన్” (ఈగ సుదీప్-జగపతిబాబు), “వీరుడొక్కడే” (అజిత్-తమన్), శీనుగాడి లవ్ స్టొరీ (ఉదయనిది స్టాలిన్-నయనతార) వంటి అనువాద చిత్రాలు, ధన్ రాజ్-శ్రీముఖిలతో తీసిన స్ట్రయిట్ చిత్రం నిర్మాతగా నాకు మరింత గుర్తింపు తెచ్చాయి. అదే సంవత్సరం ఆర్జీవితో “ఐస్ క్రీమ్-2″ కూడా తీశాను. అతి త్వరలో ఆర్జీవి దర్శకత్వంలో ముచ్చటగా మూడో చిత్రం తీసేందుకు సన్నాహాలు చేస్తున్నాను. నాకు మూడో చిత్రం చేసేందుకు అంగీకరించిన ఆర్జీవికి నా ధన్యవాదాలు. ఆయన నాపై చూపించే అపార అభిమానానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను” అన్నారు. “ఐస్ క్రీమ్” జులై 14- 2014లో విడుదలైంది. ఈ చిత్రం విడుదలై ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రామసత్యనారాయణ తన సంతోషాన్ని పంచుకుని, తమ కాంబినేషన్ లో మూడో సినిమాను ప్రకటించారు.

Related posts

Leave a Comment