Tamannaah Bhatia : ఐటెమ్‌ సాంగ్స్‌కు సై!?

Tamannaah Bhatia: Ready for item songs?
Spread the love

మిల్కీబ్యూటీ తమన్నాకు సౌత్‌లో అవకాశాలు కరువయ్యాయి. గతేడాది ‘ఓదెల 2’లో మెరిసింది. ఇది కాక మరో రెండు చిత్రాల్లో గెస్ట్‌ అప్పీయరెన్స్‌ ఇచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్‌పై బాగా దృష్టి పెట్టింది. ఆమె నటిస్తున్న ఐదు చిత్రాలు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉన్నాయి. అయితే తనకు లైఫ్‌ ఇచ్చిన సౌత్‌లో, ముఖ్యంగా తెలుగులో మాత్రం అసలు అవకాశాలు లేవు. దాంతో ఐటెమ్‌ సాంగ్స్‌కు సైతం సిద్ధమంటుందని టాక్‌. ఐతే ఐటెమ్‌ సాంగ్స్‌ ఆమెకు కొత్తేమీ కాదు. మంచి స్వింగ్‌లో ఉన్నప్పుడే అగ్ర తారల సరసన ఐటమ్‌ సాంగ్స్‌ చేసింది మిల్కీబ్యూటీ. ఇప్పుడు మరోసారి ఐటెమ్‌ సాంగ్స్‌ బాట పట్టిందని మేకర్స్‌ అంటున్నారు. దీనికి సంబంధించి గతంలోనే ఆమె ఓ బోల్డ్‌ స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చింది. ఫలానా పాత్రలే చేస్తానని మడి కట్టుకొని కూర్చుంటే పని జరగదంటూ కామెంట్‌ చేసింది. అప్పటి నుంచి అడపాదడపా ఐటెం సాంగ్స్‌ చేస్తూ అలరిస్తోంది. స్కిన్‌ షో విషయంలోనూ అసలు తగ్గడం లేదు. తన అందాల ఆరబోతతో యూత్‌ని పిచ్చెక్కిస్తోంది. దీంతో ‘మంచి పారితోషికం ఇస్తే చాలు తమన్నా దేనికైనా రెడీ’ అని మేకర్స్‌ ఫిక్స్‌ అయిపోయారు. కానీ తమన్నా మాత్రం అలా కాదంటోంది. ఎంత బోల్డ్‌గా కనిపించినా హద్దులు దాటనని, . పరిమితులు, ఆంక్షలను పాటిస్తాననీ చెబుతోంది. ఈ తరుణంలోనే ఓ క్రేజీ ఆఫర్‌ను వదులుకుంది. ఇటీవల తమన్నా దగ్గరకు ‘ఛోలీ కే పీచే క్యా హై’ రీమిక్స్‌ సాంగ్‌ ఆఫర్‌ వచ్చింది. ‘ఖల్‌ నాయక్‌’ సినిమాలోని ఈ పాట 90ల్లో కుర్రాళ్లను ఓ ఊపు ఊపింది. ఈ పాట అవకాశాన్ని మిల్కీబ్యూటీ వదులుకుంది. సంజయ్‌ దత్‌ ‘ఖల్‌ నాయక్‌ రిటర్న్స్‌’ పేరుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే! అప్పట్లో మాధురీ దీక్షిత్‌ చేసిన ఈ పాటను తమన్నాతో చేయాలని మేకర్స్‌ భావించారు. కానీ ఆమె ‘అబ్బబ్బా ఈ పాట నా వల్ల కాదు’ అని నో చెప్పేసిందట. ఇంత పాపులర్‌ సాంగ్‌ వదులుకోవడం వెనకున్న కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. 1993 సమయంలో ఈ పాట లిరిక్స్‌పై పెద్ద దుమారమే రేగింది. ఈ మధ్యన కూడా చాలా సినిమాల పాటల్లో లిరిక్స్‌ వివాదస్పదనమైన సంగతి తెలిసిందే!

Related posts