‘పెద్ది’లో కొత్త సీన్స్ యాడ్ చేస్తున్నాం : డైరెక్టర్ బుచ్చిబాబు సానా

We are adding new scenes to 'Peddi': Director Buchi Babu Sana.
Spread the love

 

* సినిమా బ్రహ్మాండంగా రన్ అవుతోంది.
* చరణ్ పెర్ఫార్మెన్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో సంచలన విజయాన్ని సాధించింది.  2026 సౌత్ ఇండియా నంబర్ వన్ గ్రాసర్ గా నిలిచింది  అన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్  ప్రెస్ మీట్‌ను నిర్వహించింది. దర్శకుడు బుచ్చిబాబు సానా, నిర్మాత సతీష్ కిలారు, లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్, మైత్రీ శశి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
చరణ్ కి ‘పెద్ది’ వంటి అద్భుతమైన సినిమా ఇచ్చారు. మీ తదుపరి సినిమా కూడా చరణ్ తోనే ఉంటుందని వింటున్నాం. అది ఎంతవరకు నిజం? అని అడిగితే.. ”దేనికైనా సమయమే నిర్ణయిస్తుంది. సమయం వచ్చినప్పుడు అది బయటకు వస్తుంది. నేను కూడా అది జరగాలని కోరుకుంటున్నాను. ‘పెద్ది’ సినిమాలో కొత్త సన్నివేశాలు ఈ బుధవారం నుంచి యాడ్ అవుతాయి. మొత్తం మూడు సన్నివేశాలు జోడించాం. హీరోయిన్‌కు సంబంధించిన మూడు సీన్లు, అలాగే జగపతిబాబుకి ఒక సీన్ ఉంటుంది.  మిస్ అయిన అంశాలన్నీ అందులో ఉంటాయి. 95 శాతం మంది ప్రేక్షకులు సినిమాలోని కంటెంట్, కథ గొప్పతనం, రామ్ చరణ్ నటనను ప్రశంసించారు. ఇలాంటి కథలు మరిన్ని రావాలని కోరుకున్నారు. మేము నమ్మిన దానిని ప్రేక్షకులు నిజం చేశారు. మేము వెళ్లిన ప్రతి థియేటర్‌లో అద్భుతమైన స్పందన లభించింది. జాన్వీ పాత్రకు సంబంధించి మరో రెండు సన్నివేశాలు ఉన్నాయి. అవి చూసిన తర్వాత ప్రేక్షకులు ఆ పాత్రకు ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవుతారు. బుధవారం నుంచి ఆ సన్నివేశాలు జోడిస్తాం. దాంతో జాన్వీ పాత్ర మరో స్థాయికి చేరుతుందని నమ్ముతున్నాను. మొన్న నేను కారులో వెళ్తుంటే ఒక ఆటో డ్రైవర్ తన అమ్మగారితో వచ్చి, “చాలా అద్భుతమైన సినిమా తీశావు బాబు. 25 సంవత్సరాల తర్వాత మళ్లీ థియేటర్‌కు వచ్చాను” అని చెప్పారు. అది నాకు జీవితాంతం గుర్తుండిపోయే కాంప్లిమెంట్. చరణ్ అద్భుతంగా చేశారని ప్రేక్షకులు అంటున్నారు. ఆయన అంత గొప్పగా నటించడానికి నేను పెద్దగా ఏమీ చేయలేదు. భోజనం చేస్తున్నప్పుడు తర్వాతి సీన్‌లో ‘పెద్ది’ ఎలా బిహేవ్ చేస్తాడో చెప్పేవాడిని. “మిగతాదంతా నేను చూసుకుంటాను” అని చరణ్ చెప్పేవారు. నేను ఊహించిన ‘పెద్ది’ పాత్రను ఆయన అద్భుతంగా ఆవిష్కరించారు. నటనలో నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లిపోయారు. ఈ పాత్రలో ఆయన జీవించారనే మాట కూడా తక్కువే. దానికంటే ఎక్కువగా చేశారు. బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ విషయంలో నేను ఎలా అనుకుంటున్నానో ఒక స్కెచ్ వేసి చూపించాను. దాన్ని చూసి షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుని అద్భుతంగా ట్రాన్స్‌ఫర్మ్ అయ్యి వచ్చారు. ఆ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు. చిరంజీవి గారు కూడా “చరణ్ అంత కష్టపడ్డాడు కాబట్టే ఇంత పేరు వచ్చింది” అన్నారు. అలాగే చాలామంది “చరణ్ జీవి” అని చెబుతుండటం ఎంతో ఆనందంగా అనిపించింది. సురేఖ గారు సినిమా చూసి చాలా ఎమోషనల్ అయ్యారు. “చాలా అద్భుతమైన సినిమా తీశావు” అని ప్రశంసించారు. ఈ సినిమా క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. కథ వినిపించినప్పుడు చరణ్ కూడా ప్రేక్షకులు ఇప్పుడు ఎలా స్పందిస్తున్నారో అలా స్పందించారు. కథ పూర్తయ్యాక లేచి నన్ను హగ్ చేసుకుని “ఈ సినిమా చేస్తున్నాం” అన్నారు ప్రేక్షకులు ఇలాంటి మంచి మోటివేషన్ వున్న సినిమా ఇంత అద్భుతంగా ఆదరించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది అన్నారు.

Related posts