మెగా హీరో నెక్స్ట్ ప్రాజెక్ట్ ?

Mega Hero's next project?
Spread the love

టాలీవుడ్ లో ‘ఉప్పెన’ సినిమాతో గొప్ప ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్, ఆ తర్వాత వచ్చిన ‘కొండపొలం’, ‘రంగ రంగ వైభవంగా’, ‘ఆదికేశవ’ చిత్రాలతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు. దీంతో కథల ఎంపికలో చాలా జాగ్రత్త పడుతున్న ఆయన, గత మూడేళ్లలో దాదాపు 100కు పైగా స్క్రిప్ట్‌లను తిరస్కరించినట్లు తెలుస్తోంది. టాప్ నిర్మాతలు సంప్రదించినా .. సరైన కథ కోసం వేచి చూసిన వైష్ణవ్, ఎట్టకేలకు తన తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. గతంలో సుధీర్ బాబుతో ‘హంట్’ అనే సినిమాను తెరకెక్కించిన దర్శకుడు మహేష్.ఎస్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మహేష్ చెప్పిన కథ వైష్ణవ్‌కు బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ ఓకే అయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే నెలలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రానుంది. ఆ వెంటనే షూటింగ్ కూడా ప్రారంభించి, ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ మళ్లీ సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు.

Related posts