‘సందిగ్ధం’ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు పార్ధసారథి

Sandigdham Will Appeal to Everyone: Director Parthasaradhi at Trailer Launch Event
Spread the love

తీర్థ క్రియేషన్స్ బ్యానర్ పై సంధ్య తిరువీధుల నిర్మాణంలో పార్థసారధి కొమ్మోజు దర్శకత్వంలో ‘సందిగ్ధం’ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి మెయిన్ లీడ్స్‌లో నటించగా, విలన్ రోల్ లో తెర చేప ఫేమ్ నవీన్ సంకరపు నటించారు. ఈ మూవీని మే 29న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. శనివారం నాడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.అనంతరం ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో..
దర్శకుడు పార్ధసారథి మాట్లాడుతూ .. ‘‘సందిగ్ధం’ ప్రయాణంలో నా భార్య సంధ్య ఎంతో సపోర్ట్ చేశారు. ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ మా కోసం ఎంతో కష్టపడ్డారు. అందరూ సపోర్ట్ చేశారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్లంతా కలిసి సపోర్ట్ చేయడం వల్లే సినిమాని ఇంత బాగా తీయగలిగాం. ‘సందిగ్ధం’ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. మే 29న మా సినిమాని చూసి ఆడియెన్స్ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
నిహాల్ మాట్లాడుతూ .. ‘‘సందిగ్ధం’ చిత్రీకరణలో నాకు దర్శక, నిర్మాతలు ఎంతో సపోర్ట్ చేశారు. వారిద్దరూ ఎన్నో కష్టాలను దాటుకుని మూవీని ఇక్కడి వరకు తీసుకు వచ్చారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఈ మూవీ రాబోతోంది. మే 29న మా మూవీని చూసి హిట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
కాజల్ తివారి మాట్లాడుతూ .. ‘నాకు తెలుగు అంతగా రాదు. సెట్‌లో ప్రతీ ఒక్కరూ నాకు సపోర్ట్ చేశారు. ‘సందిగ్ధం’లో నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. మా చిత్రం మే 29న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
అర్జున్ మాట్లాడుతూ .. ‘‘సందిగ్ధం’లో సత్య అనే మంచి పాత్రను ఇచ్చిన దర్శకుడు పార్థు గారికి థాంక్స్. నిర్మాత సంధ్య గారు మాకెంతో సపోర్ట్ చేశారు. మూవీలో నటించిన ఆర్టిస్టులందరికీ థాంక్స్. మే 29న మా సినిమాని చూసి విజయం అందిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
సంగీత దర్శకుడు గౌతమ్ రవిరామ్ మాట్లాడుతూ .. ‘‘సందిగ్ధం’ సినిమాలో మ్యూజిక్, ఆర్ఆర్ అద్భుతంగా ఉంటుంది. పార్థసారధి మూవీని డిఫరెంట్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.
నటుడు ఆనంద్ మాట్లాడుతూ .. ‘‘సందిగ్ధం’ మూవీని అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేశాం. సినిమా చాలా బాగుంటుంది. ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
నటుడు నవీన్ రాజ్ మాట్లాడుతూ .. ‘‘సందిగ్ధం’లో నేను విలన్‌గా నటించాను. ఈ మూవీ చాలా బాగా వచ్చింది. ప్రతీ ఒక్కరూ చక్కగా నటించారు. మే 29న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
నటుడు చిట్టి బాబు మాట్లాడుతూ .. ‘‘సందిగ్ధం’ సినిమాని దర్శక, నిర్మాతలు ఎంతో కష్టపడి తీశారు. ఈ చిత్రం మే 29న రానుంది. అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
ఈ మూవీకి గౌతమ్ రవిరామ్ సంగీతాన్ని అందించారు. నందన్ కృష్ణ కెమెరామెన్‌గా, విశ్వన్ రాజ్. డిఎస్ ఎడిటర్‌గా పనిచేశారు.
నటీనటులు : నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి, జీవా, నవీన్ రాజ్ సంకరపు, చిట్టి బాబు, ఆనంద్ భారతి, రైజింగ్ రాజు, అప్పారావు,నాగి రెడ్డి తదితరులు
సాంకేతిక బృందం :
బ్యానర్ : తీర్థ క్రియేషన్స్
నిర్మాత : సంధ్య తిరువీధుల
దర్శకుడు : పార్థసారధి కొమ్మోజు
సంగీతం : గౌతమ్ రవిరామ్
కెమెరామెన్ : నందన్ కృష్ణ
ఎడిటర్ : విశ్వన్ రాజ్. డిఎస్
పీఆర్వో : సాయి సతీష్

Related posts