ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్నిపరిశ్రమ అభివృద్ధికి ఉపయోగిస్తా : చదలవాడ శ్రీనివాసరావు

I will use this opportunity provided by the government for the development of the industry: Chadalawada Srinivasa Rao
Spread the love

మానవతా వాది కళా పోషకులు చదలవాడ శ్రీనివాసరావుని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర అభివృద్ధి సంస్థ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ గా నియమించిన శుభ సందర్భంలో తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ పాలక మండలి శ్రీనివాసరావుని కలిసి అభినందన శుభాకాంక్షలు తెలియచేయటం జరిగింది. అధ్యక్షులు బత్తుల ప్రసాద్ రావు, ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి చదలవాడ శ్రీనివాస్ రావుకు పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియ చేసారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తనవంతు కృషి చేసేందుకు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుస్తానని, పరిశ్రమలో చిన్నా పెద్ద భేదం లేకుండా అందరికీ అందుబాటులో ఉంటానని చదలవాడ శ్రీనివాస్ రావు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ క్రిటిక్స్ పాలక మండలి సభ్యులు బాలిరెడ్ది, యం గిరిధర్, చదలవాడ భరద్వాజ, నవీన్, శ్రీమతి పర్వీన్, బాబీ, తదితరులు పాల్గొని చదలవాడ శ్రీనివాసరావునకు అభినందనలు తెలియజేశారు.

Related posts