సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ జిఎంబి ఎంటర్టైన్మెంట్, ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో, వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’ చిత్రాన్ని సగర్వంగా సమర్పిస్తున్నారు. వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా కథ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, అలాగే ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ‘ఓ సుందరి’ పాట సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి.
తాజాగా మేకర్స్ ‘ఇంటూ ది వరల్డ్ ఆఫ్ రావు బహదూర్’ పేరుతో ఓ బీటీఎస్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో చిత్ర నిర్మాణ వైభవం, ప్రీ-ప్రొడక్షన్ పనులు, ప్రోస్తెటిక్ మేకప్, భారీ సెట్స్, షూటింగ్ విశేషాలను చూపిస్తూ సినిమా స్కేల్‌ను పరిచయం చేశారు. విజువల్‌గా అద్భుతంగా, పాత్రల ఆధారంగా నడిచే ఓ విభిన్నమైన సినిమాటిక్ అనుభవాన్ని ఈ చిత్రం అందించబోతోందనే సంకేతాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి.
ఈ వీడియోలో ప్రధాన ఆకర్షణ సత్యదేవ్ చేసిన అద్భుతమైన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్. సెట్స్‌కు వచ్చిన తర్వాత ఆయన ప్రత్యేక మేకప్, స్టైలింగ్ ప్రక్రియలో పాల్గొనే విధానాన్ని ఇందులో చూపించారు. వయసు మీద పడిన రాజరిక పాత్ర కోసం బాల్డ్ క్యాప్, ప్రత్యేక ప్రోస్తెటిక్స్, పొడవాటి తెల్లజుట్టు, దట్టమైన గడ్డం, మెలితిరిగిన మీసాలతో ఆయన ట్రాన్స్ఫార్మేషన్ అయ్యారు. ప్రత్యేక కాంటాక్ట్ లెన్సులు, గ్రాండ్ గా డిజైన్ చేసిన షేర్వాణీ, ముత్యాల హారాలు, సంప్రదాయ తలపాగా వంటి గెటప్ తో సత్యదేవ్ రాజవంశీయుడి హుందాతనాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. సినిమాలో ఆయన విభిన్న లుక్స్‌ను కూడా ఈ వీడియోలో చూపించారు.
సత్యదేవ్ ట్రాన్స్ఫార్మేషన్ పాటు చిత్ర నిర్మాణ విలువలు కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. వింటేజ్ శైలిలో నిర్మించిన భారీ ఇండోర్ సెట్స్, విశాలమైన ఔట్‌డోర్ లొకేషన్స్, యాక్షన్ సన్నివేశాల కోసం జరిగిన ప్రత్యేక శిక్షణ వంటి అంశాలు సినిమాలో దర్శకుడు ప్లాన్ చేసిన భారీ కాన్వాస్‌ను ప్రజెంట్ చేస్తున్నాయి.
ఈ చిత్రంలో దీపా థామస్ కథానాయికగా నటిస్తుండగా, వికాస్ ముప్పాల, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాకా, మాస్టర్ కిరణ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
సినిమాటోగ్రాఫర్ కార్తిక్ పరమార్, సంగీతం స్మరణ్ సాయి, ప్రొడక్షన్ డిజైనర్ గా రోహన్ సింగ్ పని చేస్తున్నారు
‘రావు బహదూర్’ ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు సిద్ధమవుతోంది.
ఈ చిత్రం జూలై 3న థియేటర్లలో విడుదల కానుంది.
తారాగణం: సత్య దేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, మాస్టర్ కిరణ్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం, ఎడిటర్: వెంకటేష్ మహా
సమర్పణ: మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ GMB ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు: చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి & శరత్ చంద్ర
ప్రొడక్షన్ బ్యానర్స్: A+S మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్
ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దినేష్ యాదవ్ బి
DoP: కార్తీక్ పర్మార్
సంగీతం: స్మరణ్ సాయి
ప్రొడక్షన్ డిజైనర్: రోహన్ సింగ్
PRO: వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైన్స్: ఎల్లో టూత్స్
‘రావు బహదూర్’ నుంచి అద్భుతమైన ‘ది వరల్డ్ అఫ్ రావు బహదూర్’ రిలీజ్
