25 రోజులు విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘గాలి’

Socio-fantasy film 'Gali' has been successfully running for 25 days
Spread the love

సంధ్య ఫిలిం బ్యానర్ పై రాంప్రసాద్ గురజాడ, అంజలి రామవతు, శ్రీకాంత్ పెరుమండ్ల యస్. చంద్ర కళ,చందా రోజా రాణి, బివి సుబ్బారెడ్డి నటీనటులుగా నాటక రంగంలో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గ్రహీత మరియు నంది గరుడ వంటి అవార్డులు పొందిన టి రాము దర్శకత్వంలో నిర్మాత చందా లక్ష్మీనారాయణ నిర్మించిన సోషియో ఫాంటసీ చిత్రం “గాలి”. ఈ చిత్రం నేటికి విడుదలై 25 రోజులైనా విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు, నిర్మాత సాయి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. బళ్లెం వేణుమాధవ్,రచయిత్రి జంద్యాల సుబ్బలక్ష్మి, డా. అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం..
గెస్ట్ గా వచ్చిన ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు : గాలి చిత్రంలో అమ్మవారి పాత్ర నాకు నా మనసుకు హత్తుకుంది. ఈమె పాత్ర చూసిన తర్వాత మా మిత్రుడు కోడి రామకృష్ణ తీసిన అమ్మోరు సినిమా గుర్తుకు వచ్చింది. ఇందులో నటించిన రోజా రాణి అంత అద్భుతంగా నటించింది. అలాగే ఇందులో నటించిన వారందరూ కూడా చాలా బాగా నటించారు.నేను చాలా సినిమాలు తీశాను అప్పుడు అన్ని వంద రోజులు ఆడేవి. ఇప్పట్లో ఈ సినిమా 25 రోజులుగా విజయవంతంగా ప్రదర్శించబడడం లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే సినిమా చాలా బాగుంది. ఇంకా ఈ సినిమా 50 రోజుల ఫంక్షన్ కూడా జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి సినిమా తీసిన దర్శక నిర్మాతలకు నా అభినందనలు తెలుపుకుంటున్నాను వారు ఇలాగే ఇంకా ఇలాంటి మంచి సినిమాలు తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
ప్రముఖ నిర్మాత దర్శకులు సాయి వెంకట్ మాట్లాడుతూ.. రాము గారు అర్ధరాత్రి 12 వరకు నాటకాలు వేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేసేవాడు. అటువంటి తను ఒక సినిమా తీసి రిలీజ్ చేయడమే కాకుండా ఏకంగా 25 రోజులు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుందడం గొప్ప విషయం.ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలన్నీ ఒక్క వారానికే పరిమిత మవుతున్నాయి. అటువంటి ది రాము గారు తన గాలి సినిమాని 25 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడడం అనేది కచ్చితంగా అభినందించాల్సిన విషయమే. ఇప్పుడు వచ్చే కొత్త నిర్మాతలు రాము గారి సలహాలు తీసుకొనే స్థాయికి ఎదిగాడనిపించింది. అలాగే ఈ మధ్య కాలంలో 25 రోజులు పూర్తి చేసుకున్న ఏకైక చిత్రం గాలి అవ్వడంతో..నా దృష్టిలో రాము గారు ఒక్క మగాడు లా అనిపించాడు. తను ఇలాగే ఎన్నో సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
చిత్ర నిర్మాత చందా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. నాకు సినిమా ఫీల్డ్ కొత్తయినా రాము గారు రాసుకున్న షోషియో ఫాంటషీ కథ నచ్చడంతో ఈ సినిమా చేయడం జరిగింది. విడుదలైన అన్ని చోట్ల నుంచి మా గాలి సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో నటించిన వారందరూ కొత్తవారైనా చాలా బాగా నటించారు. రాము గారు రాత్రి పగలు అనకుండా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు తన కష్టం ఫలించిందనిపిస్తుంది. 25 రోజులుగా మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు అని అన్నారు.
చిత్ర దర్శకుడు రాము మాట్లాడుతూ.. కలి పురుషుడికి అమ్మవారికి మధ్య జరిగే భీకర పోరాటమే ఈ “గాలి”చిత్రం. నటీనటులు సాంకేతిక నిపుణులు ముఖ్యంగా చందా లక్ష్మీనారాయణ ఇచ్చిన సపోర్టుతో తీసిన ఈ సినిమా 25 రోజులుగా ప్రేక్షకుల ఆదరాభిమానాల తో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు
అమ్మ వారి పాత్రలో నటించిన రోజా రాణి మాట్లాడుతూ.. నేను నటించిన ఈ సినిమా ఇంత దూరం వస్తుందని అనుకోలేదు చాలా సంతోషంగా ఉంది. సినిమాలో నటించాలాసనుకున్న నాకు రాము గారు ఛాన్స్ ఇవ్వడంతో నాకు ఇచ్చిన పాత్రలో నటించి మెప్పించాలనే కసిని నాలో కలిగింది. నేను నటించిన పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నందున దర్శకులు రాము గారికి థాంక్స్ చెప్పుకుంటూ ఇలాగే నేను చేసే పాత్రలను ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు
ఎడిటర్ వేణుగోపాల్ చౌదరి మాట్లాడుతూ.. అప్పట్లో భూకైలాస్ సినిమాను ఊరురా తిప్పి సినిమాను ప్రదర్శించారు. ఆ తరహాలో ఈ గాలి చిత్రాన్ని కూడా రాము గారు హైదరాబాద్ చుట్టూ వేసి విజయవంతంగా సక్సెస్ అయ్యారు. మా టీమ్ అందరూ సపోర్ట్ చేయడంతో ఈ సినిమా బాగా రావడమే కాకుండా సినిమా చాలా బాగుందని ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. దర్శక,నిర్మాతలు మాతో ఇలాగే మరెన్నో సినిమాలు తీసి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
నటుడు సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. గాలి సక్సెస్ మీట్ జరుపుకోవడం చాలా సంతోషం. సినిమా అంటే నాకు పిచ్చి. రాము గారు ఈ సినిమాలో కలిపురుషుడు పాత్ర లో నన్ను యాక్టింగ్ చేయించడం జరిగింది. అందుకు వారికి నా ధన్యవాదములు. రాము గారు ఇంకా ఎన్నో సినిమాలు చేయాలన్నారు.
రచయిత్రి జంద్యాల సుబ్బలక్ష్మి మాట్లాడుతూ.. ఈ సినిమా చూసిన తరువాత రాముగారి విశ్వరూపం కనిపించింది.. గాలి టైటిల్ చాలా బాగుంది.దైవ భక్తి ని నమ్ముకుంటే ఎలాంటి ఇబ్బందులు కలగవు అంటూ నిర్మించిన ఈ చిత్రంలో చాలా మంచి మెసేజ్ ఉంది..మంచి హిట్ అయిన రాముకు మరిన్ని సినిమాలు తియ్యాలన్నారు.
డా. అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ఇలాంటి ఈ వెంట్ లో నేను భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది.
బల్లెం వేణు మాధవ్ మాట్లాడుతూ.. అమ్మ వారి పాత్రలో నటించిన రోజా రాణి పెద్ద ఆర్టిస్ట్ లకు ఏ మాత్రం తీసిపోకుండా చాలా చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు . ఆమెను చూస్తుంటే దేవతని చూస్తున్నానేమో అనిపించింది. అలాగే రాక్షసుడు పాత్రలో సుబ్బారెడ్డి పరకాయ ప్రవేశం చేశాడేమో అనేలా చాలా బాగా నటించాడు. వీళ్ళందరితో సినిమాను ఇంత బాగా చేసిన.సో రాము గారికి చాలా బంగారు భవిష్యత్ ఉంది. అలాగే నిర్మాతల సహకారంతో తీసిన తీసిన వీరి కాంబినేషన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను
ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొని 25 రోజులు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు
ఇందులో నటించిన నటీనటులకు సాంకేతిక నిపుణులకు అందరికీ శాలువాలతో సన్మానం చేసి షీల్డ్ లు బహుకరించడం జరిగింది.
సినిమా పేరు : గాలి
నటీ నటులు : రాంప్రసాద్ గురజాడ, అంజలిరామవతు, శ్రీకాంత్ పెరుమండ్ల యస్. చంద్ర కళ,చందా రోజా రాణి, బివి సుబ్బారెడ్డి తదితరులు
సాంకేతిక నిపుణులు :
బ్యానర్ : సంధ్యా ఫిలిమ్స్
నిర్మాత : చందా లక్ష్మీనారాయణ
కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం : తీడ రాము
ఎడిటర్ : వేణు చౌదరి
కెమెరామెన్ : కే ప్రకాష్
సంగీతం : అనిల్ కుమార్ మద్రాసు

Related posts