‘దూరదర్శని’ చూసిన ప్రేక్షకులకు వాళ్ల సొంతూరికి వెళ్లిన ఫీల్‌ కలుగుతుంది : హీరో సువిక్షిత్‌

“Audiences who watch ‘Doordarshini’ will feel like they’ve gone back to their hometowns”: Hero Suvikshit
Spread the love

సువిక్షిత్‌, గీతికా రతన్‌ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘దూరదర్శని’. కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్‌ పతాకంపై జయ శంకర్‌ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ నెల15న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా ఈ చిత్రం హీరో సువిక్షిత్‌ మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఆ వివరాలివి.
నేపథ్యం ఏమిటి?
కడప జిల్లా రాయచోటి. నాకు వ్యాపారం ఉంది. చిన్నప్పటి నుండి సినిమాలంటే పాషన్‌.. సినిమాలను చూసి ఇన్‌స్పయిర్‌ అయ్యే వాడిని. అనుకోకుండా ఈ ‘దూరదర్శని’ సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. నాకు మంచి కథలతో సినిమాలు చేయాలని ఉంది.
ఈ సినిమాలోకి హీరోగా ఎలా అవకాశం వచ్చింది?
రచయిత నారాయణ, అరుణాచలంలో కలిసిన ఓ యాచకుడి జీవిత గాథ ఆధారంగా ఈకథను అనుకుని రాసుకున్నారు. అయితే మొదట ఈ సినిమాను వేరే హీరోతో చేద్దామని ప్లాన్‌ చేశాం. అయితే కథకు కొత్త హీరో అవసరం కాబట్టి నాకున్న ఇంట్రెస్ట్‌తో .. ఆ పాత్రకు నేను సెట్‌ అవుతానని భావించి కథానాయకుడిగా నేనే నటించాను. ఇటీవల విడుదలైన టీజర్‌, పాటలు, ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. తప్పకుండా చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని అనుకుంటున్నాను.
మిమ్ములను మీరు ఈ కథ కోసం ఎలా మౌల్ట్‌ చేసుకున్నారు?
ఈ కథను నేను కూడా విన్నాను. 90 బ్యాక్‌ డ్రాప్‌లో నడిచే ఈ కథలో లీడ్‌ పాత్రకు అప్పట్లో ఎలాంటి అనుభూతి పొందామో తెలుసుకుని నటించాలి. ఆ అనుభూతి పొందిన వారిలో నేను కూడా ఉన్నాను. అందుకే నేనే చేస్తే సహజంగా ఉంటుందని భావించాను. నేను ఈసినిమాలో ప్రత్యేకంగా నటించలేదు. జస్ట్‌ ఆ టైమ్‌లో ఎలా ఉండాలో అలా బిహేవ్‌ చేశాను.
రిలీజ్‌ను గ్రాండ్‌గా ప్లాన్‌ చేస్తున్నారా?
మేము ఎదో తక్కువ థియేటర్స్‌లో రిలీజ్‌ చేద్దాం అనుకున్నాను. ఇప్పడు దాదాపుగా 250పైగా థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం.
సినిమాలో హీరో , హీరోయిన్‌ చనిపోతారు అంటున్నారు? ఆ పాయింట్‌ను ఎందుకు రివీల్‌ చేశారు?
హీరో, హీరోయిన్ చనిపోయిన తరువాత హ్యపీ ఎండింగ్‌ ఎలా ఇచ్చాం. అసలు అరుణాచలంలోకి ఆ పెద్దాయన ఎలా వచ్చాడు? ఆయన జీవితంలో జరిగింది ఏమిటి అనేది కథ. సినిమాలో హీరో ఫాదర్‌గా ఆ పెద్దాయన పాత్ర కనిపిస్తుంది. 90లో ప్రతి ఒక్కరూ వాళ్ల ఊరిలో తిరిగొచ్చిన ఫీల్‌ కలుగుతుంది.
ఈ సినిమాలో హీరో పాత్రలో మీరే నటించడానికి కారణం ఏమిటి?
ఈ సినిమాలో దాదాపు అందరూ కొత్తవాళ్లే. సహజత్వం కోసం కొత్తవాళ్లతో నటించాం. పేరున్న ఆర్టిస్టులు నటిస్తే పాత్రలు కనిపించవు. అతని పాపులారిటీ కనిపిస్తుంది. అందుకే నేచురాలిటి ఫీల్‌ కోసం కొత్తవాళ్లతో చేశాం.
ఈ సినిమా వర్కింగ్‌ ఎక్స్‌ పీరియన్స్‌ ఏలా ఉంది?
ప్రతి సినిమాకు ఉండే కష్టాలు మాకు ఉన్నాయి. అయితే ఆర్టిస్టులు, టెక్నిషియన్స్‌ అందరూ సపోర్ట్‌ చేశారు. కానీ ఈ రోజు సినిమాను విడుదల వరకు తీసుకరావడం మేము సాధించిన విజయంగా భావిస్తున్నాం. ఇక మంచి సినిమాను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఈ సినిమాను క్వాలిటీ కోసం బెస్ట్‌ అవుట్‌పుట్‌ ఇవ్వటానికి టైమ్‌ తీసుకున్నాం. యానాం, కాకినాడ పరిసర ప్రాంతాల్లో చాలా నేచురల్‌గా లోకేషన్స్‌లో 90వ దశకం గుర్తొచ్చేలా సెట్‌లు వేసి ఈ సినిమా తీశాం. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాదు.
90వ దశకం బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకోవడానికి రీజన్‌ ఏమిటి?
సిటీకి అలవాటు పడి అందరం మన మూలాలను, పల్లెట్లూర్లను మర్చిపోతున్నాం. అందుకే అందర్ని వెనక్కి తీసుకెళ్లి జ్ఞాపకాలు గుర్తుకు తెస్తున్నాం. ఈ సినిమా చూసిన వారికి వాళ్ల సొంతూరు గుర్తుకొస్తుంది.
సినిమా టిక్కెట్‌తో పాటు కర్చీఫ్‌ ఇస్తామని అంటున్నారు?
ఈ సినిమా చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఈ సినిమాలో ఎమోషన్‌ చూసి ఎడ్వకుండా ఎవ్వరూ ఉండలేరు.

Related posts