హిట్ మిషన్ అడివి శేష్ లేటెస్ట్ ఆడియన్స్ బ్లాక్‌బస్టర్ ‘డెకాయిట్’. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించారు. శానిల్ డియో దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్‌తో విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్స్ మీట్ నిర్వహించారు. హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ వస్తుంది. అందుకే నాకు ‘గుడ్ సినిమా’ శేష్ అనే ట్యాగ్ రావాలని కోరుకున్నాను. అలాంటి సంతృప్తి ఈ సినిమా ఇచ్చింది. ఈ సినిమా కోసం కొన్ని సన్నివేశాల్లో ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొన్నాం. ప్రేక్షకులకు రియల్ అనుభూతి ఇవ్వాలని చాలా కష్టపడ్డాం. టెక్నికల్ బ్రిలియన్స్ తో పాటు భావోద్వేగాలు, ప్రమాదకర పరిస్థితులు అన్నీ అందులో మిళితమై ఉన్నాయి. అలాగే రెండు భాషల్లో సినిమా తీశాం. ప్రేక్షకులకు గొప్ప అనుభూతి ఇవ్వాలనే లక్ష్యంతో పని చేశాం ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాలో క్లైమాక్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా మందికి నచ్చింది. అది భీమ్స్ ట్యూన్. నా కెరీర్‌లో ఇది మొదటి మ్యూజికల్ హిట్. బీమ్స్ చేసిన నాలుగు పాటలు కూడా ట్రెండింగ్‌లో ఉన్నాయి. బుక్ మై షోలో టికెట్లు ఫాస్ట్‌గా ఫుల్ అవుతున్నాయి. మీరందరూ చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు అన్నారు. నిర్మాత సుప్రియ యార్లగడ్డ డైరెక్టర్ శానిల్ డియో, మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్, రైటర్ అబ్బూరి రవి, లిరిసిస్ట్ భాస్కరభట్లతో పాటు చిత్ర యూనిట్ అందరూ పాల్గొన్నారు.
‘డెకాయిట్’ సంతృప్తినిచ్చింది : హీరో అడివి శేష్
