వేసవిలో రవిబాబు ‘రేజర్’

Ravi Babu's 'Razor' in the summer
Spread the love

తెలుగు సినిమాలో యూనిక్ ఫిల్మ్ మేకర్ గా, నటుడిగా ముద్రవేసిన రవిబాబు తన గత చిత్రాల కన్నా భిన్నమైన ఇంటెన్స్ వైలెంట్ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌ ‘రేజర్’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు సమర్పిస్తుండగా, ఫ్లయింగ్ ఫ్రాగ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం, రవిబాబు తండ్రి దివంగత చలపతిరావు జయంతి సందర్భంగా, మే 8, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ‘ఎనుగుతోండం ఘటికాచలం’ వంటి లైట్ టోన్ చిత్రంతో అలరించిన రవిబాబు, ఇప్పుడు ‘రేజర్’తో టెన్షన్, సైకాలజికల్ వైలెంట్ యాక్షన్ తో కూడిన డార్క్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. దర్శకుడిగానే కాకుండా ప్రధాన పాత్రలోనూ నటిస్తూ, ఈ సినిమాకు తనదైన రా టచ్ ఇచ్చారు. టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే మంచి హైప్ తెచ్చుకున్న ‘రేజర్’, తాజాగా విడుదలైన రిలీజ్ డేట్ గ్లింప్స్‌తో మరింత ఆసక్తి రేపుతోంది. రవిబాబు టెర్రిఫిక్ గా కనిపించి థ్రిల్ కలిగించారు. తాజాగా విడుదలైన పోస్టర్లు సినిమాకి ఉన్న డార్క్ టోన్‌ను మరింత బలంగా చూపిస్తున్నాయి. నగర అల్లకల్లోలం, ఇండస్ట్రియల్ షాడోస్ మధ్య రవిబాబు ఇంటెన్స్ లుక్‌లో కనిపించగా, ఒక పోస్టర్‌లో చిన్నారి తో కలిసి వీధిలో నడుస్తూ కనిపించడం కథలో ఎమోషనల్ యాంగిల్ కూడా ఉంటుందనే సంకేతాలు ఇస్తోంది. ఫిబ్రవరిలో షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. డబ్బింగ్ పనులు కూడా పూర్తి కాగా, ఫైనల్ ఫినిషింగ్ పనులు వేగంగా సాగుతున్నాయి.  ఈ చిత్రానికి చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ, ఎస్‌ఎస్ రాజేష్ సంగీతం, సతీష్ పొలొజు యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. రేజర్ మే 8న థియేటర్లలో ప్రేక్షకులకు విభిన్నమైన థ్రిల్లర్ అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది.

Related posts