సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో, వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘రావు బహదూర్’ చిత్రాన్ని సగర్వంగా అందిస్తోంది. ఈ చిత్రాన్ని ఏ ప్లస్ ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బలమైన కథాంశాలతో, కంటెంట్ బేస్డ్ తెలుగు సినిమాలకు మద్దతుగా నిలిచే ఈ రెండు నిర్మాణ సంస్థలకు ‘రావు బహదూర్’ మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌గా నిలవనుంది. టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన తర్వాత, టీం ఇప్పుడు మ్యూజిక్ ప్రమోషన్స్ కిక్ స్టార్ట్ చేస్తున్నారు. స్మరణ్ సాయి స్వరపరిచిన ఫస్ట్ సింగిల్ ‘ఓ సుందరి’ ఈ నెల 15న విడుదల కానుంది. సత్యదేవ్, దీపా థామస్‌లను రొమాంటిక్ సెటప్‌లో ప్రజెంట్ చేసిన సాంగ్ రిలీజ్ అనౌన్స్మెంట్ పోస్టర్ ఆకట్టుకుంది. సత్యదేవ్ పొడవాటి జుట్టు, కళ్ళద్దాలతో రెట్రో-కూల్ లుక్‌లో కనిపిస్తుండగా, దీప ఎంతో హుందాగా, ప్రశాంతంగా కనిపిస్తుంది. ఈ బ్యాక్ డ్రాప్ సున్నితమైన లవ్ మెలోడీని సూచిస్తున్నాయి. సైకలాజికల్ ఇంటన్సిటీ, కనుమరుగవుతున్న ఒక రాజరిక ప్రపంచపు అవశేషాలను కలగలిపిన ఎమోషనల్ డ్రామాగా ‘రావు బహదూర్’ రూపుదిద్దుకుంటోంది. రచయిత, దర్శకుడు, ఎడిటర్‌గా వెంకటేశ్ మహా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ కథని మలిచారు. ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం పని చేస్తున్నారు. సినిమాటోగ్రఫీని కార్తిక్ పరమార్ నిర్వహిస్తుండగా, సంగీతాన్ని స్మరణ్ సాయి అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ రోహన్ సింగ్. అగ్రశ్రేణి నిర్మాతలు, ప్రత్యేకమైన కథన శైలితో కూడిన దర్శకుడు, అలాగే సత్యదేవ్ కెరీర్‌లోనే అత్యంత అద్భుతమైన నటనను కనబరిచే పాత్రలో కనిపిస్తున్న ‘రావు బహదూర్’ పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.
తారాగణం: సత్య దేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, మాస్టర్ కిరణ్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం, ఎడిటర్: వెంకటేష్ మహా
సమర్పణ: మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ GMB ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు: చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి & శరత్ చంద్ర
ప్రొడక్షన్ బ్యానర్స్: A+S మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దినేష్ యాదవ్ బి
DoP: కార్తీక్ పర్మార్
సంగీతం: స్మరణ్ సాయి
ప్రొడక్షన్ డిజైనర్: రోహన్ సింగ్
PRO: వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైన్స్: ఎల్లో టూత్స్
సత్యదేవ్ ‘రావు బహదూర్’ ఫస్ట్ సింగిల్ ‘ఓ సుందరి’
