జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిహారిక కొణిదెల ‘రాకాస’ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ చిత్రాన్ని ఈనెల 3న రిలీజ్ చేశారు. డిఫరెట్ ప్రమోషనల్ స్ట్రాటజీతో సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని.. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ దూసుకెళ్తోంది. ఏపీ, తెలంగాణలో శ్రీలక్ష్మీ నరసింహా మూవీ మేకర్స్ బ్యానర్‌పై విడుదలైన చిత్రం ఇప్పటికే మంచి కలెక్షన్స్‌ను రాబడుతూ ఫన్టాస్టిక్ బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకెళ్తోంది. లేటెస్ట్గా మేకర్స్ ఈ సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేసే పనిలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ ధరను రూ.100గా ఫిక్స్ చేశారు. దీంతో రాకాస చిత్రం సామాన్యుడికి మరింత చేరువ కానుంది. చక్కటి అర్థవంతమైన కామెడీతో ఈ సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తోంది. సంగీత్, గెటప్ శీను ట్రాక్ ప్రేక్షకులకు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో పాటు వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్, నటనకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ప్రేక్షకులు ఈ సమ్మర్లో కుటుంబంతో కలిసి ఈ సినిమాను చూడటానికి ప్రాధాన్యతను ఇస్తున్నారు. జీస్టూడియోస్ సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిహారిక కొణిదెల సినిమాను రూపొందించిన తీరు, డైరెక్టకర్ మానస శర్మ టేకింగ్ సహా ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ పని తీరుని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. నిర్మాతగా నిహారిక తన తొలి చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’తో బ్లాక్ బస్టర్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు.
సామాన్యుడికి మరింత చేరువ.. తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్స్ టికెట్ ధర రూ.100గా ఫిక్స్!
