తొలి తెలుగు ఏఐ సినిమా ‘అంబ’s రివెంజ్’ టైటిల్ పోస్టర్‌ విడుదల

“Amba’s Revenge” – First AI-Based Telugu Feature Film Announced
“Amba’s Revenge” – First AI-Based Telugu Feature Film Announced
Spread the love

* ఆధునిక సాంకేతికతతో పౌరాణిక చిత్రం

చలనచిత్ర పరిశ్రమలో చరిత్ర సృష్టిస్తూ, సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ పూర్తిస్థాయి కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో రూపొందుతున్న తొలి తెలుగు ఫీచర్‌ ఫిల్మ్‌గా ‘అంబ’s రివెంజ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీకాంత్ రెడ్డి కుందూరు నిర్మాతగా, రాణి మాడిసన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, జయవర్ధన్ మాడి క్రియేటివ్ డైరెక్టర్‌ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మహాభారతంలోని శక్తివంతమైన పాత్ర అంబ కథను ఆధారంగా తీసుకుని ఈ పౌరాణిక చిత్రాన్ని వినూత్నంగా తెరకెక్కిస్తున్నారు. శ్రీ లలితకళా చిత్రాలు, నక్క తోక ఫిల్మ్స్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. హనుమాన్ విజయోత్సవం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాత శ్రీకాంత్ రెడ్డి కుందూరు, క్రియేటివ్ డైరెక్టర్ జయవర్ధన్ మాడి మాట్లాడుతూ.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాము. ‘అంబ’s రివెంజ్’ ప్రాజెక్టు కోసం అత్యాధునిక ఏఐ టూల్స్‌ను వినియోగిస్తూ విజువల్స్‌, పాత్రల రూపకల్పన, కథన నిర్మాణం వంటి అంశాలను కొత్త శైలిలో ఆవిష్కరిస్తున్నాం. హనుమాన్ విజయోత్సవం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేస్తున్నాం. ఈ ప్రాజెక్టుకు సంభందించి పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తాం” అని తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమలో ఏఐ ఆధారిత కథాచిత్రాల దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. పౌరాణిక కథను ఆధునిక సాంకేతికతతో మిళితం చేస్తున్న ఈ ప్రయోగాత్మక చిత్రం తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.