‘ఫంకీ’ బ్యూటీకి బంపరాఫర్!

A bumper offer for the 'funky' beauty!
Spread the love

అందం, అభినయం కలగలిసిన అస్సాం సుందరి కయాదు లోహర్ ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. వెండితెరపై గ్లామర్‌తో కుర్రకారును ఉర్రూతలూగించడమే కాదు, నటనకు ఆస్కారమున్న పాత్రల్లోనూ మెప్పించగలనని నిరూపించుకున్న ఈ భామకు ఇప్పుడు అదృష్టం గట్టిగా తలుపు తట్టింది. కెరీర్ ఆరంభంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సక్సెస్ రేటుకు మారుపేరుగా నిలిచిన దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్‌లతో ఒక భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో వెంకీ సరసన కీర్తి సురేశ్ నటిస్తుండగా, కల్యాణ్ రామ్ జోడీగా కయాదు లోహర్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. అపజయం ఎరుగని అనిల్ రావిపూడి సినిమాలో అవకాశం దక్కించుకోవడం అంటే ఈ ముద్దుగుమ్మ కెరీర్ మలుపు తిరిగినట్లేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి. వైవిధ్యమైన పాత్రలు క్రియేట్ చేసే అనిల్ రావిపూడి సినిమాలో కయాదు తన మార్కు చూపిస్తే, ఇక ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇటీవల విశ్వక్ సేన్‌కి జోడీగా ‘ఫంకీ’ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించింది కయాదు లోహర్. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. సినిమా ఫలితం ఎలా ఉన్నా ఆమె అందానికి మాత్రం ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఆమె నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ ది ప్యారడైజ్ ’లో నటిస్తోంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తాజాగా కయాదు మరో బంపరాఫర్ పట్టేయడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

A bumper offer for the 'funky' beauty!
A bumper offer for the ‘funky’ beauty!

Related posts