శివానీ నాగరం : సింగర్‌ టర్నింగ్‌ యాక్టర్‌!

Shivani Nagaram: Singer-turned-actor!
Spread the love

కూచిపూడి, సంగీతం నేర్చుకున్నా. సింగర్‌ టర్నింగ్‌ యాక్టర్‌ని. ‘లిటిల్‌ హార్ట్స్‌’ చిన్న హమ్మింగ్‌ ఉంటుంది. ఆరంభం సినిమాలో ఓ పాట పాడాను. అవకాశాలు వస్తే కచ్చితంగా పాడతాను. తెలుగు అమ్మాయినే అయినా సినిమాల్లోకి వెళ్తానంటే, ఇంట్లో వాళ్లు ఎంతో సహకారం అందించారు. వాళ్లు ఇచ్చిన అవకాశాన్ని మంచి సినిమాలతో నిలబెట్టుకున్నా. ఇంట్లో వాళ్లు కూడా చాలా సంతోషంగా ఉన్నారు”అంటూ చెప్పుకొచ్చింది శివానీ నాగరం. ఇటీవల ఓ సందర్భంలో. తనకు వంద సినిమాలు చేసేయాలని లేదని, ప్రేక్షకులు ఇచ్చిన విలువను కాపాడుకోవడమే ముఖ్యమని అంటున్నారు. అందుకే కథ, పాత్ర నచ్చితేనే సినిమాలు చేస్తున్నానని చెప్పారు. ‘లిటిల్‌హార్ట్స్‌’తో వచ్చిన సక్సెస్‌ను అడ్వాంటేజీగా తీసుకుని వరుసగా సినిమాలు చేయాలన్న ఆలోచన లేదు. కథ నచ్చితే కాంబినేషన్‌తో సంబంధం లేకుండా ఒప్పుకొంటాను. కథ విన్నప్పుడు నేను కథతో కనెక్ట్‌ అవుతున్నానా? నా పాత్రకు ఉన్న ప్రాధాన్యం ఏమిటి? అనేది చూసుకుంటాను. ‘లిటిల్‌హార్ట్స్‌’లో చివరగా సెలెక్ట్‌ అయ్యాను. నాకు 100 సినిమాలు చేయాలని లేదు. చేసినవి ఐదు సినిమాలు అయినా మంచి కథలతోనే చేస్తాను. స్టార్‌ హీరోలతో చేసే అవకాశమొచ్చినా కథ, నా పాత్ర నచ్చితే అంగీకరిస్తా. ఎటువంటి నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చాను. ప్రేక్షకులు ఇచ్చిన విలువను నిలుపుకోవడం ముఖ్యం కదా. తెలుగు అమ్మాయిలకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. చిన్న సినిమాలను కూడా ప్రేక్షకులు పెద్ద హిట్‌ చేస్తున్నారు. ‘వరుసగా సినిమాలు చేయకపోతే కనిపించకుండా పోతావు’ అని పలువురు హెచ్చరించారు. కానీ, నేను మాత్రం ఎంపిక చేసుకునే సినిమాలు చేస్తున్నా. ‘ఈ అమ్మాయి ఎప్పుడూ మంచి సినిమాలే చేస్తుంది’ అనే మాట అందరినోటా వినాలని ఉంది. నాకు రొమాంటిక్‌ కామెడీ సినిమాలంటే చాలా ఇష్టం. నేను నటించిన సినిమాలు ఓటీటీలో రావడం వల్ల అన్ని భాషల నుండి ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు, తెలుగులో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చింది. దటీజ్..శివానీ!!

Related posts