రెమ్యూనరేషన్ లో తగ్గేదే లేదు ..  వరుస హిట్స్ తో ఫుల్ జోష్!

There is no reduction in remuneration.. Full of excitement with consecutive hits!
Spread the love

దక్షిణాది సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రెండు దశాబ్దాలుగా తన గ్లామర్, నటనతో ఇండస్ట్రీని ఏలుతుంది.  వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో ఈ అమ్మడు  ఇప్పుడు మరో భారీ ప్రాజెక్టుతో సెన్సేషన్ సృష్టిస్తోంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’లో నయనతార కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ మూవీ కోసం నయనతార తన  రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ‘కేజీఎఫ్’ సిరీస్‌తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన యష్ సరసన నయనతార నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రంలో ఆమె ‘గంగ’ అనే అత్యంత శక్తివంతమైన పాత్రలో కనిపించబోతోంది. ఇటీవల విడుదలైన నయనతార గన్ పట్టుకుని ఉన్న ఒక పోస్టర్ నెట్టింట సెన్సేషన్ సృష్టించింది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, యాక్షన్ సీక్వెన్స్‌లలో కూడా ఆమె అదరగొట్టనుందని ఫిలిం నగర్ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం నయనతార తీసుకుంటున్న పారితోషికం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మొదట ఆమె ఈ పాత్ర కోసం రూ. 18 కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, మేకర్స్‌తో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం రూ. 12 కోట్లకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. బాలీవుడ్ రేంజ్ లో సౌత్ ఇండియాలో ఒక హీరోయిన్ ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోవడం నయనతార క్రేజ్‌కు నిదర్శనమని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో పీరియడ్ యాక్షన్ డ్రామాగా ‘టాక్సిక్’ రూపొందుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, మలయాళ ముద్దుగుమ్మ హుమా ఖురేషి,  రుక్మిణి వసంత్ వంటి స్టార్ నటీమణులు ఉన్నప్పటికీ, కథను మలుపు తిప్పే ప్రధాన ఆకర్షణ మాత్రం నయనతార పాత్రేనని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. యష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు..  డ్రగ్ మాఫియా నేపథ్యంలో సాగే ఈ కథలో నయనతార – యష్ మధ్య వచ్చే సీన్లు హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్‌లోనూ సత్తా చాటిన నయనతార, ఇప్పుడు ‘టాక్సిక్’తో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతోంది. గీతూ మోహన్ దాస్ టేకింగ్, యష్ స్క్రీన్ ప్రెజెన్స్, నయనతార పవర్ ఫుల్ యాక్టింగ్ తోడవడంతో ‘టాక్సిక్’ ఇండియన్ సినిమా హిస్టరీలో మరో మైలురాయిగా నిలవడం ఖాయమని సినీట్రేడర్స్ అంచనా వేస్తున్నారు..

Related posts