
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వహించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు–2026లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్విట్జర్లాండ్‌లోని జురిచ్ లో ఉన్నారని తెలుసుకున్న ముఖ్యమంత్రి, ఆయన్ని సదస్సుకు ఆహ్వానించారు. ముఖ్యమంత్రి ఆహ్వానాన్ని గౌరవిస్తూ చిరంజీవి సదస్సుకు హాజరై, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై ఆవిష్కరించిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్ను ప్రత్యక్షంగా వీక్షించారు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణ అభివృద్ధి దృక్పథాన్ని ప్రతిబింబించిన ఈ ఘట్టం ప్రత్యేకంగా నిలిచింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవిని ఘనంగా ఆహ్వానించారు. తమ కుటుంబ సభ్యులతో పాటు మనవళ్లతో కలిసి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాను వీక్షించానని, సినిమాను ఎంతో ఆస్వాదించానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సినిమా అందించిన వినోదం పట్ల ఆయన తన అభినందనలను వ్యక్తిగతంగా చిరంజీవి గారితో పంచుకున్నారు. స్విట్జర్లాండ్‌లో అనుకోకుండా కలుసుకున్న ఈ సదస్సు సందర్భంగా స్నేహపూర్వకంగా కలసి మంచి సమయాన్ని గడిపారు. చిరంజీవి కుటుంబంతో కలిసి వ్యక్తిగత విహారయాత్ర నిమిత్తం స్విట్జర్లాండ్‌కు వెళ్లిన సమయంలోనే ఈ ఆహ్లాదకరమైన సమావేశం.. అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడం చోటు చేసుకుంది.
