తక్కువకాలంలో స్టార్‌డమ్ సంపాదించుకున్న హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. క్యూట్ ఫేస్‌తో, అమాయకపు చిరునవ్వుతో అందరినీ బుట్టలో వేసుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా అంతటా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె హీరోయిన్‌గా నటించిన ‘పరాశక్తి’ మూవీ సంక్రాంతి పండక్కి (జనవరి 10న) విడుదలవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చింది. తను ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకున్న విషయం గురించి తొలిసారి స్పందించింది. శ్రీలీల మాట్లాడుతూ.. పిల్లల ప్రస్తావన వస్తే నాకు మాటలు రావు. వాళ్లు నాతో ఉంటే బాగుండేదనిపిస్తుంది. నాతో కలిసుండకపోయినా నేను వారిని బాగా చూసుకుంటున్నాను. కిస్ (2019) అనే కన్నడ మూవీ సమయంలో దర్శకుడు నన్ను ఓ ఆశ్రమానికి తీసుకెళ్లాడు. అక్కడే ఈ పిల్లలు ఉండేవారు. మేము ఫోన్‌లో మాట్లాడేవాళ్లం. వీలు దొరికినప్పుడల్లా అక్కడికి వెళ్లేదాన్ని. కానీ, ఈ విషయాన్ని నేను చాలాకాలం రహస్యంగా ఉంచాను. అయితే ఆ ఆశ్రమం వాళ్లు దీన్ని గోప్యంగా ఉంచడం దేనికి? మీరు బయటకు చెప్తేనే మిమ్మల్ని చూసి ఇంకో నలుగురైనా ముందుకొస్తారు అన్నారు. నిజమే కదా అనిపించింది. నేనేదో గొప్ప చేశానని చెప్పడం లేదు కానీ జనాలు కూడా ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుందని చెబుతోంది. దటీజ్.. శ్రీలీల!
దటీజ్.. శ్రీలీల!
