చిన్న సినిమాలకు ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ అవార్డులు : కె.ఎస్.రామారావు

Film Nagar Cultural Center awards for short films: K.S. Rama Rao
Spread the love

ఉత్తమ చిత్రం: ‘కోర్ట్’ ,
ఉత్తమ హీరో : అఖిల్ రాజ్ (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ హీరోయిన్ : తేజస్వీరావు (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ దర్శకుడు : సాయిలు కంపాటి

చిన్న సినిమాలను ప్రోత్సహించడం కోసం ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ తరపున అవార్డులను బహుకరించనున్నట్లు అధ్యక్షుడు కె.ఎస్.రామారావు వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో కొద్దిసేపు ముచ్చటిస్తూ…ఈ ఏడాది పది కోట్ల లోపు బడ్జెట్ తో నిర్మించిన చిన్న సినిమాలకు ఈ అవార్డులను అందజేస్తామని చెప్పారు. ఈ నెల 31న నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రధానం చేస్తామని అన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాదిలో విడుదలైన ‘కోర్ట్’ను ఉత్తమ చిత్రంగాను, ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం నుంచి అఖిల్ రాజ్ ను ఉత్తమ హీరోగాను, ఉత్తమ హీరోయిన్ గా తేజస్వీరావు, ఉత్తమ దర్శకుడిగా సాయిలు కంపాటికి అవార్డులు అందజేస్తామని ఆయన తెలిపారు. వీరితో పాటు సినిమా పరిశ్రమలో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న నిర్మాతలు అశ్వనీదత్, అల్లు అరవింద్ లను సన్మానించనున్నట్లు ఆయన వివరించారు. ఫిల్మ్ నగర్ క్లబ్ అభివృద్ధికి కృషి చేసిన కాజా సూర్యనారాయణను కూడా ఈ సందర్భంగా సన్మానిస్తామని ఆయన చెప్పారు.

Related posts