వైభవంగా వెండితెర ఆణిముత్యాల సన్మాన కార్యక్రమం

A grand ceremony to honor the silver screen gems
Spread the love

హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ నందు ఆదివారం నాడు జరిగిన వెండితెర ఆణిముత్యాల సన్మాన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నటకిరీటి,హాస్య నట చక్రవర్తి డా!రాజేంద్రప్రసాద్ విచ్చేసి నటీ,నటులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నటులకు అవార్డులు, సన్మాన కార్యక్రమాలు బూస్ట్ లాంటివని,ప్రేక్షకుల కరత్వాల ధనులే వారు పడిన కష్టానికి ప్రతిఫలాని అన్నారు.నాతో కలసి నటించిన నటులకు నా చేతుల మీదుగా సన్మానం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని,ఈ అవకాశం ఇచ్చిన మాదల నాగూర్ కు మన ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ 24 క్రాఫ్ట్ చైర్మన్ డాక్టర్ రాజేంద్ర జె ఎన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాని అన్నారు. అదేవిధంగా సీనియర్ హీరో భానుచందర్ మాట్లాడుతూ సీనియర్ నటులను గౌరవించి సన్మానించుకోవటం అనేది చాలా గొప్ప విషయం అని ఇలాంటి ఆలోచన చేసి వి రందరికి సన్మాన కార్యక్రమం నిర్వహించిన ఆ టీం కి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ తో పాల్గొనటం నా అదృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు అదేవిధంగా చైర్మన్ రాజేంద్ర జె ఎన్ మాట్లాడుతూ ఎప్పటినుండో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని అనుకున్నాము ఈనాటికి పెద్దల చేతుల మీద ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ఇంకా రానున్న రోజుల్లో కార్యక్రమాలు ఎన్నో చేస్తామని ఆయన తెలిపారు. ప్రోగ్రాం ఆర్గనైజర్ నిర్మాత డాక్టర్ మాదల నాగూర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు పెద్దలు నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ మరియు భానుచందర్ వారి చేతుల మీద ఈ కార్యక్రమం నిర్వహించి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బాబ్జి . పృథ్వీరాజ్. ఘర్షణ శ్రీనివాసరావు. తిలక్. సినిమా టీవీ ఆర్టిస్ట్ రాగిణి. శివాజీ రాజా. తమిళ్ హీరో జే బీ నాయుడు.పాదర్శి ప్రసాదు. కూరపాటి లక్ష్మీ పూర్ణచంద్రరావు. జె వి వెంకటసుబ్బ. యామర్తి రాము. ఏసుబాబు. రంజిత్ కుమార్. పి స్ పి శర్మ గుర్రపు విజయ్ కుమార్. హీరోయిన్ లక్ష్మి. జబర్దస్త్ అప్పారావు. చిట్టిబాబు. జూనియర్ సూపర్ స్టార్ కృష్ణ. పొట్టి మామ. రాజనాల సత్య. శ్రీమణి. యాంకర్ హమీద్. ఇంకా ఎంతోమంది హీరోలు డైరెక్టర్లు నిర్మాతలు జూనియర్ ఆర్టిస్టులు తదితరులు పాల్గొన్నారు

Related posts